తాజా ప్రెస్ మీట్ తో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పేరు మరోసారి ట్రెండ్ అవుతుంది! హైద్రాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో లాయర్ల తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన శ్రీరెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.! ఆ నాలుగు కుటుంబాలంటూ సినిమా పెద్దల్ని టార్గెట్ చేస్తూ ఆమె అనేక ఆరోపణలు చేశారు.
1) ఓ నటి నడిరోడ్డుపై అర్థనగ్న ప్రదర్శన చేసి క్యాస్టింగ్ కౌచ్‌పై నిలదీస్తే బయటికి రాని పెద్ద మనుషులు… పవన్ కళ్యాణ్‌ని ఒక్కమాట అనేసరికి అంతా ఏకమయ్యారు.!
2) మా అసోసియేషన్ ముందు నేను దర్నా చేస్తే నన్ను బ్యాన్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఛాంబర్లో హంగామా చేస్తే ఆయన పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు.?
3) పవన్ పేరుతో ఫ్యాన్స్ రౌడీయిజం చేస్తే ఆ నష్టం పవన్ కళ్యాణ్‌కే.!
4) నాపై సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్లు చేసిన వారిని కోర్టుకు లాగుతా. నన్ను శారీరకంగా మానసికంగా హింసించే వారిని చట్టపరంగానే ఎదుర్కొంటా.
5) ఇంతకు ముందు నేను కొంత మంది ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులపై చేసిన వ్యాఖ్యలకి కట్టుబడే ఉన్నా.. కోన వెంకట్, నాని, శేఖర్ కమ్ముల సంగతి త్వరలోనే బయటపెడతా చట్టబద్దంగా ఎదుర్కొంటా.!
PRESS MEET TOTAL FOOTAGE: