“ఏ తల్లీ వినకూడనిది విన్నా” – శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన గురించి ఆమె తల్లి ఏమన్నారో చూడండి.! [VIDEO]

“ధర్మం నీవైపు ఉందా అమ్ములు ధర్మం నీ వైపు ఉంటే గనుక కొంచెం లేటైనా గాని నీవైపే వస్తది నువ్వేం భయపడకు”….శ్రీరెడ్డి తండ్రిగారు ”పదిమందికి మేలు జరుగుతుందంటే మా అమ్మాయి చేస్తున్నది కరెక్టే”….శ్రీరెడ్డి తల్లి పుష్పవతిగారూ తమ కూతురు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు..కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి అన్నివైపులనుండి మద్దతు లభిస్తుంది..తాజాగా తన పేరెంట్స్ కూడా తమ మద్దతు తెలిపారు..శ్రీరెడ్డి తల్లి ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏ తల్లీ తన బిడ్డను ఇలాంటి పరిస్థితుల్లో చూడాలని కోరుకోరు. ఏ తల్లి తన కూతురు గురించి వినకూడని మాటలు.. చూడకూడనవి నేను చూశా అంటూ భావోద్వేగంతో శ్రీరెడ్డి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

శ్రీరెడ్డి సొంత ఊరు విజయవాడలోని కంకిపాడు. ఆమె చిన్నప్పటి నుండి చాలా మొండిగా ఉండేది. తాను అనుకున్నదే జరగాలని భావించే స్వభావం అందుకే పలు సందర్భాల్లో కుటుంబంతో గొడవలు పడేదన్నారు శ్రీరెడ్డి తల్లి. ఆమె మొదట్లో బ్యూటీ పార్లర్ నిర్వహించేదని.. ఆ సందర్భంలో వివాహం అయ్యిందన్నారు. మొదట్లో వాళ్ల కాపురం సవ్యంగానే సాగినా తరువాత మనస్పర్ధల కారణంగా విడిపోయిందని ఆ తరువాత హైదరాబాద్‌లో ఓ టీవీ ఛానల్‌లో ఉద్యోగం కోసం వెళ్లిందన్నారు.అయితే ఆమె ఓ ఛానల్‌లో ఉద్యోగం చేయడం మాకు ఇష్టం లేదని ఇదే విషయాన్ని ఆమె చెప్పితే విభేదించిందన్నారు. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తా అన్నప్పుడు కూడా అభ్యతరం తెలపడంతో కుటుంబానికి దూరంగా ఉందన్నారు. ఆమె ఇంటి నుండి వెళిపోయి పదేళ్లు అయ్యిందని అప్పటి నుండి ఆమెతో పెద్దగా సంప్రదింపులు లేవన్నారు. తనకు ఏమైనా చెప్పినా వినే స్వభావం ఆమెది కాదని… మీ కూతురు చనిపోయిందని అనుకోండని ఇంటి నుండి బయటకు వచ్చిందన్నారు. అప్పటి నుండి నేనే అప్పడప్పుడు శ్రీరెడ్డి దగ్గరకు వస్తానన్నారు. అప్పుడు కూడా ఏదైనా చెప్పినా నాకు చెప్పొద్దు నేను ఇలాగే ఉంటా అని మొండిగా చెప్పేదన్నారు.

Ma ammagarini media ibbandhi pettatam assalu 1000% naku nachaledhu..anthatha matramga vunna securityni drustilo…

Posted by Sri Reddy on Wednesday, 11 April 2018

తమ కుటుంబం ఎప్పుడు దైవచింతన‌లోనే ఉంటుందని.. శ్రీరెడ్డి కూడా చాలా పూజలు చేసేదన్నారు ఆమె తల్లి. అయితే శ్రీరెడ్డి తమ కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్లిన తరువాత వాళ్ల నాన్న ఆమెతో ఇప్పటి వరకూ మాట్లాడలేదని.. ఆయనకి నాకు ఎప్పుడూ దేవుడు, పూజలు తప్ప వేరే ఆలోచన ఉండదన్నారు. మా కుటుంబానికి బయట వ్యక్తులతో సంబంధం ఉండదన్నారు. కనీసం మా ఇంట్లో ఓ పేపర్ ఉండదు, ఓ టీవీ ఉండదు, పెళ్లిళ్లకు వెళ్లము. కాని మీ అమ్మాయి ఇలా చేయకూడని పని చేసిందంటే చాలా బాధగా ఉందన్నారు. ఏ తల్లైనా ఏదైతే చూడకూడదు, వినకూడదు అనిఅనుకుంటుందో అదే చేసింది. ఇలాంటి సమయంలో శ్రీరెడ్డి దగ్గరకు వెళ్లాలని అనుకోవడం లేదన్నారు శ్రీరెడ్డి తల్లి.
పది మంది బాగుంటారు అనిపిస్తే తాము ధర్మం వైపే ఉంటామన్నారు శ్రీరెడ్డి తల్లి. తన కూతురు చేసే పోరాటంలో న్యాయం ఉంటే సమర్ధిస్తాం అన్నారు.అయితే అది మంచిది కాకపోతే పోరాటాన్ని వదిలేయాలన్నారు. అయితే తమ కూతురు నిరసన తెలిపిన విధానం మాత్రం కరెక్ట్ కాదన్నారు. ఏదేమైనా ఆమె వాదనలో న్యాయం ఉంటే ధర్మమే గెలుస్తుందన్నారు శ్రీరెడ్డి తల్లి.

watch video here:

Comments

comments

Share this post

scroll to top