శ్రీరెడ్డి పై “పవన్ కళ్యాణ్” ఫాన్స్ దాడి..! పేరు నుండి రెడ్డి తీసేయమని బెదిరిస్తున్నారు…! ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితి.?

మొన్నటికి మొన్న ఒక ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ ని ధైర్యంగా చెప్పిన శ్రీరెడ్డి,నిన్న ఒక టివి ఛానెల్ లైవ్ షోలో ఎమోషనల్ అయ్యారు..కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే అనేకమంది హీరోయిన్లు ప్రస్తావించారు.. అర్చన,కస్తూరి,గాయత్రి గుప్తా,మాధవిలత ఇలా ఎంతోమంది హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లు అవ్వాలంటే ఖచ్చితంగా అన్నింటికి సిధ్దపడితీరాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు.శ్రీరెడ్డి కొందరు నటులను ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం విశేషం…పవన్ గురించి కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు దాంతో పవన్ ఫ్యాన్స్ దాడికి పాల్పడ్డారని,తన తల్లిదండ్రుల పరిస్థితిని చెప్పుకొచ్చారు..

శ్రీరెడ్డి గా పరిచయం ఉన్న విమల మల్లిడి జిందగీ,నేను నాన్న అబద్దం,అరవింద్ 2 సినిమాలలో హీరోయిన్ గా నటించింది..ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు ఆవేశపూరితంగా సమాధానమిచ్చింది శ్రీరెడ్డి.ఒక హీరోయిన్ ఎన్నో అవకాశాలతో దూసుకుపోతుందంటే ఖచ్చితంగా పడుకుని తీరాల్సిందే… ఒకవేళ అన్నింటికి సిద్దమైనా కూడా అవకాశాలు రాక,లేదంటే ఏదో చిన్న క్యారెక్టర్ తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది..మన తెలుగు అమ్మాయిల్ని ఇండస్ట్రీలోకి పంపిచకపోవడానికి మెయిన్ రీజన్ కాస్టింగ్ కౌచ్..ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితి ఉందని తెలిసాక ఏ అమ్మాయి తల్లిదండ్రులైనా తమ ఆడపిల్లల్ని ఇటు  పంపిస్తారా??అంటూ ప్రశ్నించింది.ఒకవేళ మేం అన్నింటికి సిధ్దం అని చెప్పినా కూడా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇచ్చేవారెవరు అంటూ ఆగ్రహించింది.అందరికి మళయాళి ముద్దుగుమ్మలే కావాలా,తెలుగు అమ్మాయిలు అక్కర్లేదా అంటూ కొంతమంది హీరోలపేర్లు ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించింది.

తెలుగు గురించి గొప్పగా చెప్తారు కదా మరి ఆ పవన్ కళ్యాన్ తెలుగు అమ్మాయిలకోసం ఏం చేస్తున్నాడు అంటూ పవన్ ని కూడా ప్రశ్నించింది..దాంతో పవన్ ఫ్యాన్స్ ఆమె మీద మాటల దాడికి దిగారు.ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ..ఇప్పటికే ఎన్నో రకాలుగా అవమానాలు పడ్డాను ఇది తక్కువ కాదు అంటూ వ్యాఖ్యానించింది.అంతేకాదు తన తల్లిదండ్రులకు మానసిక క్షోభని మిగిల్చాను తప్ప ఏం సాధించలేదు.దయచేసి తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి వచ్చి తల్లిదండ్రులను క్షోభపెట్టొద్దు అని చెప్పుకొచ్చింది..తన పేరు పట్ల వచ్చిన వ్యతిరేకతని కూడా చెప్పుకొచ్చింది..ఆమె మాటల్లోనే చూడండి.

watch video here:

Comments

comments

Share this post

scroll to top