తన తల్లి మాటలకు కన్నీరుమున్నీరైన శ్రీరెడ్డి

శ్రీరెడ్డి ఇప్పుడు ఈ పేరు టాలివుడ్లో ఒక సంచలనం..తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వాలి,ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పెరిగిపోయిందంటూ మొదట వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి పోరాటం అంచెలంచెలుగా పెరిగింది..ఇండస్ట్రీలో రోజుకొకరి గురించి లీక్ చేస్తు ఇప్పటికే కొందరు డైరెక్టర్లు,నిర్మాతలు,హీరోల పేర్లను బయటపెట్టింది.అర్దనగ్న ప్రదర్శనతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఇదే క్రమంలో శ్రీరెడ్డి పోరాటానికి మద్దతు పెరుగుతుంది..

సినినటి అపూర్వ ఇప్పటికైనా దీని గురించి మాట్లాడుతున్నందుకు సంతోషం,మేమెలాగు మా సమస్యలు చెప్పుకోలేకపోయాం.శ్రీరెడ్డి వలన అయినా ఈ సమస్యలు బయటికి వచ్చినందుకు థాంక్యూ,తనకు నా పూర్తి సపోర్ట్ ఉంటుందని..మా లో సభ్యులైన మమ్మల్ని సంప్రదించకుండా శ్రీరెడ్డిని ఎలా బహిష్కరిస్తారంటూ తన మా సబ్యత్వాన్ని వద్దనుకున్నారు అపూర్వం..మరోవైపు మహిళా సంఘాలు శ్రీరెడ్డికి సపోర్ట్ చేస్తూ మంత్రి తలసానిని కలవడం జరిగింది..ఇప్పుడు ఒక టివి ఛానెల్ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి తల్లిదండ్రులు తన పోరాటంలో న్యాయం ఉంటే మా సపోర్టు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.తన తల్లిమాటలకు భావోద్వేగానికి గురైన శ్రీరెడ్డి లైవ్లోనే కన్నీరుమున్నీరయ్యారు…

ఏ తల్లి చూడకూడనిది చూసా,వినకూడనిది విన్నా… అయినా నా కూతురు చేసే పోరాటంలో న్యాయం ఉంటే మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అన్న తన తల్లి మాటలు విన్న శ్రీరెడ్డి..ఏ బిడ్డ ఏ తల్లికి మిగల్చని కడుపుకోత నేను మిగిల్చాను,నా తల్లి కాబట్టి తట్టుకోగలగుతుంది. మా అమ్మలాంటి అమ్మ ఎవరికి ఉండదు..కనీసం నేను చనిపోయినా పోయింది అనుకునేవారేమో.కాని వారు తలెత్తుకోలేని విధంగా చేశాను అంటూ భావోద్వేగానికి గురి అయింది…

 

Comments

comments

Share this post

scroll to top