లైవ్ లో తిట్టుకున్న శ్రీరెడ్డి, జ్యోతి.! మధ్యలో యాంకర్ అలా అడిగి అందిరినీ చిరాకు పెట్టింది.! [VIDEO]

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ నటి శ్రీరెడ్డి సంచలనాలు సృష్టించే స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉంది. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె టాలీవుడ్ పెద్దలపై.. ఇండస్ట్రీ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడడం గమనించిన న్యూస్ ఛానళ్లు.. ఆమెను లైవ్ లో కూర్చోబెట్టి గంటల తరబడి లైవ్ షోలు నడిపించేస్తున్నాయి.

తాజాగా ఓ ఛానల్ లో శ్రీరెడ్డి ని ఇంటర్వ్యూ చేయగా.. అదే కార్యక్రమానికి నటి జ్యోతిని కూడా ఆహ్వానించడం విశేషం. శ్రీరెడ్డి చెబుతున్న కొన్ని అంశాలను జ్యోతి ఖండించడం.. దానికి శ్రీరెడ్డి ఆవేశపడిపోవడం కనిపించింది. తనకు జరిగిన కొన్ని అంశాలను చూపించి.. ఇండస్ట్రీ మొత్తం ఇలాగే ఉంటుందని ఎలా చెబుతావన్నది జ్యోతి ప్రశ్న. దానికి శ్రీరెడ్డి నుంచి సరైన జవాబు రాలేదు. అయితే.. తనకు ఎదురైన సంఘటనల ఆధారంగానే ఓ మంచి కోసం పోరాటం చేస్తున్నానని అంటున్న శ్రీరెడ్డి.. ఇప్పుడప్పుడే తెలుగమ్మాయిలు కొత్తగా వచ్చి కొత్తగా పీకేది(సాధించేది) ఏమీ లేదని.. కోట్లు కోట్లు సంపాదించబోలేరని అంటోంది.

అయితే దీనిపై జ్యోతి మాత్రం వ్యతిరేకంగా రియాక్ట్ అయింది. కొత్త వాళ్లను రావద్దని చెప్పడం కరెక్ట్ కాదని.. అయినా ఇండస్ట్రీలోకి వచ్చే అందరూ డబ్బు కోసం రారని.. వారికి ఆన్ స్క్రీన్ పై కనిపించడం ఓ ప్యాషన్ అని వాదించింది జ్యోతి.

మరోవైపు ఓ లుంగీ కట్టుకున్న వ్యక్తి ఇంటికి వచ్చాడని చెప్పింది శ్రీరెడ్డి. ఇలాంటివన్నీ చెప్పి ఏం సాధిస్తావన్న జ్యోతి.. చివరకు నాకిష్టం లేక పంపించా అంటావ్ అంతే కదా.. ఏం జరగనప్పుడు గొడవెందుకు అంటోంది జ్యోతి. అయితే.. ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న లేడీ యాంకర్ మాత్రం.. అప్పుడు ఏం జరిగింది అని ప్రశ్నించి ఆరా తీసే ప్రయత్నం చేయడం అందిరినీ చిరాకు పెట్టింది.

watch video here:

Comments

comments

Share this post

scroll to top