వైవా హర్షతో మరికొన్ని వాట్సాప్ చాట్స్ లీక్ చేసిన “శ్రీరెడ్డి”.! కానీ ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన వెంటనే డిలీట్.?

తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వాలని,ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పెరిగిపోయిందని గత కొంతకాలంగా  వ్యాఖ్యలు చేసిన వివాదస్పద నటి శ్రీరెడ్డి…మరో అడుగు ముందుకేసి మా అసోసియేసన్ ముందు అర్దనగ్నంగా ప్రదర్శన చేసింది..శ్రీరెడ్డి సంచలన చర్యతో అందరూ దిగ్బ్రాాంతి చెందగా…మరోవైపు శ్రీ లీక్స్ కంటిన్యూ చేస్తూనే ఉంది..తాజాగా వైవా హర్షా పేరు బయటపెట్టడమే కాదు..హర్ష వాట్సప్ ఛాటింగ్ స్క్రీన్ షాట్స్ తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్టు చేసింది.

అర్థనగ్నంగా నిరసన తర్వాత శ్రీరెడ్డిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తన నిరసన కొనసాగుతుందని… త్వరలోనే అందరి గుట్టు విప్పుతానని చెప్పింది. చెప్పినట్లుగానే తన లీక్స్‌ను మొదలు పెట్టింది.ఇంతకుముందు కొరటాల శివ,రమేష్ పప్పాల,శేఖర్ కమ్ముల ,నాని పేర్లను ఇండైరెక్ట్ గా బయటపెట్టిన శ్రీ రెడ్డి.. ఇండియన్ ఐడల్ శ్రీరామ చంద్ర వాట్సప్ ఛాటింగ్ స్క్రీన్ షాట్లను బైట పెట్టింది.ఇప్పుడు వైవా హర్ష వంతు వచ్చింది.

వైవా హర్షతో చేసిన చాట్ మొత్తాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ది గ్రేట్ వైవా హర్ష ను… షార్ట్ ఫిల్మ్స్‌లో అవకాశాల కోసం సాయం కోరానంది శ్రీరెడ్డి.చిన్న ఆర్టిస్టులు కూడా ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి… ఏదైనా చేసుకొని బతకొచ్చుగా అన్నవారికి ఇదే తన సమాధానమంది శ్రీరెడ్డి. తాను చిన్న ప్రాజెక్టులు కూడా చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసాను. ప్రతిచోటా ఇదే పరిస్థితి ఎదురయ్యిందని చెప్పుకొచ్చింది. వైవా హర్ష చాట్ హిస్టరీ మొత్తాన్ని శ్రీరెడ్డి పోస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

https://www.facebook.com/iamsrireddy/posts/2088684048045183

Comments

comments

Share this post

scroll to top