“పెళ్లి అయినా కూడా ఇంకొకరి పైన చేతులువేసుకుని మూతులు నాక్కోడానికి సిగ్గు లేదా.?” శ్రీకాంత్ పై ఫైర్ అయిన శ్రీరెడ్డి.!

ఫిలిం చాంబర్ వద్ద అర్ధనగ్న నిరసన చేసిన  శ్రీరెడ్డిని సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తున్నట్టు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రకటించింది. మాలో సభ్యత్వం ఉన్న 900 మందిలో ఎవరూ ఆమెతో నటించం అని  మా అధ్యక్షుడు శివాజీరాజా స్పష్టం చేశారు. శ్రీరెడ్డి వ్యవహారంపై నటుడు శ్రీకాంత్ స్పందిస్తూ  పిల్లల ముందు చూడాలంటే ఇబ్బందికరంగా ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా దానిని ‘మా’ దృష్టికి తీసుకురావాలని, ఎవరూ శ్రీరెడ్డిలా ప్రవర్తించి పరువు తీయొద్దని హీరో శ్రీకాంత్ సూచించారు. సమస్య గురించి చెబితే విచారించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు..

శ్రీకాంత్ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి ఘాటుగా స్పందించింది..తనను టాలీవుడ్ నుంచి వెలివేయడం మూఢాచారమని, టాలీవుడ్‌ను ఆ నాలుగు కుటుంబాలు ఏలుతున్నాయని, ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని, ఇదంతా ప్రజలు గమనించాలని ఆమె కోరారు. ‘‘చలువ కళ్లాద్దాలు పెట్టుకుని కార్లలో తిరుగుతూ మీరు చేసిన సినిమాల వల్ల పిల్లలకు సిగ్గువేయడం లేదా? నార్త్ ఇండియన్స్‌ను తీసుకువచ్చి ఎక్స్‌పోజ్ చేయించినప్పుడు సిగ్గనిపించలేదా? మీకు పెళ్లిళ్లు అయినా వాళ్ల పక్కన కూర్చొని, వాళ్లపై చేతులు వేసి మూతులు మూతులు నాక్కొడానికి సిగ్గేయట్లేదా? మీరు చేసే సినిమాలు చిన్నపిల్లలు చూసే విధంగా ఉన్నాయా? పిల్లలున్నారని ఇప్పుడు గుర్తుకొచ్చిందా?’’ అంటూ శ్రీరెడ్డి మండిపడ్డారు.

 

Comments

comments

Share this post

scroll to top