రంకు అంటగడతారా, ఆధారాలన్నీ అక్కడ ఇచ్చేశా.. నాకేమైనా అయితే భూకంపమే.. శ్రీరెడ్డి సంచలనం!

శ్రీరెడ్డి టాలివుడ్లో ఇప్పుడు ఈ పేరొక సంచలనం..కాస్టింగ్ కౌచ్ గురించి  వ్యాఖ్యలు చేస్తూ..తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వాలంటూ మొదలైన ఈమె పోరాటం..అర్దనగ్న ప్రదర్శనతో ఇప్పుడు జాతీయస్థాయి సెలబ్రిటిగా మారింది .శ్రీ లీక్స్ పేరుతో నిర్మాతలు,దర్శకులు,షార్ట్ ఫిలిం యాక్టర్,సింగర్ పేర్లను బైట పెట్టిన శ్రీరెడ్డి.ఇటీవల రకుల్ ప్రీత్ ను చెప్పుతో కొడతాను అని మరొక సంచలన వ్యాఖ్య చేసింది..ఈ నేపథ్యంలో శ్రీరెడ్డికి ఒక న్యూస్ ఛానెల్ సపోర్ట్ ఉందని,ఆ ఛానెలే వెనకుండి శ్రీరెడ్డితో ఇదంతా నడిపిస్తుందనే వాదన వినిపిస్తుంది.దీనిపై శ్రీరెడ్డి స్పందించింది.

కాస్టింగ్ కౌచ్ వలన వందలాది మంది యువతుల మానాలు నలిగిపోతున్నాయని, అందువలనే తాను ఈ పోరాటానికి దిగాను. తనకు రంకు అంటగడితే నిప్పుతో ఇల్లు కడుక్కున్నట్లే అని శ్రీరెడ్డి హెచ్చరించింది.తాను భాదితురాల్ని కాబట్టే మీడియా తన వెనుక ఉండి సపోర్ట్ చేస్తోంది. సదరు మీడియా ఛానల్ కు తాను తన వద్ద ఉన్న ఆధారాలు ఇచ్చేశా. నా కేమైనా అయితే వారు ఆ సాక్ష్యాలని బట్టబయలు చేస్తారని హెచ్చరించింది శ్రీరెడ్డి .

తన పోరాటానికి రాజకీయ రంగు పులుముతున్నారని ,తాను టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు, వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రచారం చేయడం తగదు. తాను దాదాపు రెండు సంవత్సరాల పాటు జగన్ కి సంబందించిన ఓ ఛానల్ ఉప్పు తిన్నాను. తాను ఏ పార్టీకి వ్యతిరేకమూ కాదు ఏ పార్టీకి అనుకూలము కాదు అనే విషయాన్ని గమనించాలని శ్రీరెడ్డి కోరింది. మా అసోసియేషన్ వారు ఎన్ని రాజకీయాలు చేసినా తాను లొంగనని, కొంతమంది తనకు డబ్బు ఇచ్చి మభ్యపెట్టాలని ప్రయత్నించారు. వారికీ నేను దాసోహం అవకపోవడం వలెనే ఇలాంటి ఆరోపణాలు సృష్టిస్తున్నారని సోషల్ మీడియాలో వీడియో ప్రకటన ద్వారా తెలిపింది.

Comments

comments

Share this post

scroll to top