సంచలనంగా మారిన “శ్రీరెడ్డి” మరో లీక్..! “కోన వెంకట్” ఎంత అసభ్యంగా మాట్లాడాడో చూడండి.!

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి రోజుకో సంచలనం సృష్టిస్తోంది శ్రీరెడ్డి. తెలుగమ్మాయిలను వాడుకుని వదిలేస్తున్నారు తప్ప అవకాశాలు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనిలో భాగంగా శ్రీరెడ్డి కోన వెంకట్ గురించి తెలిపింది. కోన వెంకట్ గురించి ఆమె ఏమన్నదో ఆమె మాటల్లోనే..
‘‘కోన వెంకట్‌కు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని శ్మశానం వెనకాల ఒక గెస్ట్ హౌస్ ఉంది. అప్పుడు రాత్రి 9 అయింది. నన్ను పిలిచాడు. పిలిచిన తర్వాత వి.వి.వినాయక్ కూడా ఇక్కడికే వస్తుంటాడు మేము ఇక్కడే సిట్టింగ్‌లు వేస్తాం. వస్తాడు కాసేపట్లో పరిచయం చేస్తాను అని పిలిచాడు. ఆడపిల్లలం. మాకు ఆశ ఉండదా? మేము కూడా వర్క్ చేసుకోవాలనే కదా వెళతాం. వాళ్ల చేతుల కింద నలిగిపోయి.. వాళ్లు వేశ్యలకు మల్లే నాలుగు డబ్బులు చేతిలో పెడితే తినాలనుకుంటామా? ఆశ ఉండదా మాకు? వర్క్ ప్లేస్‌లో బోనస్ రావాలని అనుకోమా? ప్రమోషన్ రావాలని అనుకోమా? మీరు చేసేది న్యాయమైతే అర్ధరాత్రి.. అపరాత్రి కడుపు కట్టుకుని.. క్యాబ్‌‌లెక్కో.. లేదంటే ఓన్ కార్లు వేసుకునో వెళతాం. ఆశపడటం తప్పైతే ప్రపంచంలో ప్రతివాడూ ఏ ఆశ లేకుండా బతకాలి. సన్యాసుల్లా బతకాలి’’
 ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘‘కోన వెంకట్ దగ్గరకు వెళ్లాను. తాగుతావా? అంటే నాకు తాగుడు అలవాటు లేదు అన్నాను. నన్ను శారీరకంగా బలవంతం చేశాడు కోన వెంకట్. నేను నిరూపిస్తా. ఇప్పటికీ ఆధారాలున్నాయి. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆధారాల్లేకుండా మాట్లాడొద్దు అని చాలా మంది మాట్లాడారు. ఇపుడు ఆధారాలు చూపిస్తే జీర్ణించుకోలేరు. ఆమె ఇష్టమయ్యే వెళ్లింది కదా.. ఆమె నవ్వుతుంది కదా. నా ఆవేదన నా కడుపు ఉడికిపోవడం నాకు తెలుసు. నా కుటుంబానికి తెలుసు. ఎంతమంది చేతుల్లో నలిగిపోవాలి?’’ అంటూ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది శ్రీరెడ్డి.

Comments

comments

Share this post

scroll to top