ఇన్ని రోజులు సినిమా వాళ్ళని టార్గెట్ చేసిన “శ్రీరెడ్డి”..ఇప్పుడు చంద్రబాబు, కేసీఆర్ పై ఏమని పోస్ట్ చేసిందో తెలుసా?

గత నెల రోజులగా టాలీవుడ్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న నటి శ్రీరెడ్డి, తనకు న్యాయం చేయాలంటూ ఫిల్మ్ చాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసి పెను దుమారాన్నే సృష్టించింది. ఈ వ్యవహారంతో శ్రీరెడ్డి పేరు జాతీయస్థాయికి వెళ్లిదంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం ట్వీట్ చేశాడు. తాజాగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను శ్రీరెడ్డి టార్గెట్ చేసుకుంది. తన ఫేస్‌బుక్ ఖాతాలో ఆమె పెట్టిన పోస్ట్‌పై మరి ఇద్దరు చంద్రులు స్పందిస్తారా?. ‘ప్రపంచమంతా నా నిరసన గురించి చర్చించుకుంటోంది. కానీ మన మంత్రులు, ఇద్దరు సీఎంలు మాత్రం దీని గురించి మాట్లాడక పోవడం చాలా విచారకరం’ అంటూ వ్యాఖ్యానించింది. మరోవైపు కొద్ది సేపటి కిందట ఫేస్‌బుక్‌ లైవ్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి, నాకు జరిగిన అన్యాయంపై మహా టీవీకి ఆధారాలు సమర్పించానని, తనకు మద్దతుగా నిలిచిన ఆ ఛానల్‌పై తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదని సూచించింది.

బాధితుల పక్షాన నిలబడితే వారితో సంబంధాలు అంటగట్టడం చాలా బాధాకరమని వాపోయింది. నా వెనుక రాజకీయ హస్తం ఉందనే ఆరోపణల్లో వాస్తవం లేదని, తాను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదని అన్నారు. దీన స్థితిలో ఉన్నప్పుడు తనకు సాక్షి టీవీ రెండున్నరేళ్లు అన్నం పెట్టిందని, తాను తిన్నింటి వాసాలు లెక్కబెట్టే దాన్ని కాదని పేర్కొంది. నా వెనుక టీడీపీ ఉందనే ఆరోపణల్లో నిజంలేదని, నేను చేస్తున్న పోరాటానికి మీడియా మద్దతు ఇస్తుంటే తప్పుబట్టడం మూర్ఖత్వమని, కొన్ని వందల మంది మానాలు కామాంధుల చేతిలో నలిగిపోతుంటే, ప్రశ్నించినందుకు రాజకీయంగా ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడింది. మీడియా ప్రశ్నిస్తుంటే వాళ్లపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు.

Whole world is discussing about our protest,how sad our ministers nd both c.ms are not talking about this

Posted by Sri Reddy on Monday, 9 April 2018

డబ్బు ఆశచూపినా లొంగిపోకుండా సదుద్దేశంతో ముందుకొచ్చినప్పుడు, దాన్ని అర్థం చేసుకోకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటే దీనికి ‘మా అసోసియేషన్’‌లో ఉండే రాజకీయాలే కారణమా? అంటూ దుయ్యబట్టింది. మీరు ఇస్తానన్న డబ్బులు తీసుకోకపోవడంతోనే తనపై లేనిపోని నిందలు వేస్తున్నారని, మీరు డబ్బు ఇస్తామన్నారా? లేదా? మీ కుటుంబాల మీద ఒట్టేసి చెప్పండి అంటూ ఆమె డిమాండ్ చేశారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లో సభ్యత్వం ఇవ్వక పోవడం పట్ల శ్రీరెడ్డి నిరసన వ్యక్తం చేస్తుండగా, ఆమెకు సభ్యత్వం ఇచ్చే ప్రసక్తే లేదని ‘మా’ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు మా అసోసియేషన్‌లో ఉన్న 900 మంది సభ్యుల్లో ఎవరైనా ఆమెతో నటిస్తే వారిని కూడా బహిష్కరిస్తామని తెలిపింది.

Mahaa Tv ki ranku antagadithe,nipputho illu kadukunnatte..agni ni sudhi cheyalani try cheyakandi

Posted by Sri Reddy on Monday, 9 April 2018

Comments

comments

Share this post

scroll to top