శ్రీరెడ్డి ఈ సారి ఏకంగా “దిల్ రాజు” ని టార్గెట్ చేసి పోస్ట్ పెట్టింది.! చనిపోతే శని వదులుద్ది అంట.?

టాలీవుడ్‌ కాస్టింగ్ కౌచ్‌పై గత నెల రోజులుగా పోరాటం చేస్తోన్న నటి శ్రీరెడ్డి, గతంలో కొందరు తనతో ఎలా ప్రవర్తించారో తెలుపుతూ కొన్ని ఫోటోలను బయటపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అనూహ్యంగా నిర్మాత దిల్ రాజును టార్గెట్ చేస్తూ ఆమె పెట్టిన పోస్ట్ ప్రకంపనలు రేపుతోంది. టాలీవుడ్ నుంచి దిల్ రాజు పోతే శని వదిలిపోతుందని, ఆయన కుల రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించింది. ఆయన చేతుల్లో ఎంతో మంది నలిగిపోతున్నారని ఆరోపించింది. ‘కుల రాజకీయాలు వద్దన్నా. ఆడ పిల్లలన్నా. బతకనిద్దామన్నా పాపం. దిల్ రాజు (రెడ్డి) గారూ… ప్లీజ్ సంకెళ్లు వేసిన కళామతల్లిని బంధ విముక్తురాలిని చేయండి. మీరు పోతే శని వదిలిపోయింది అనుకుంటారు. బతికుండగానే దయచేసి మారండి. వట్టి చేతులతో పోతాం. మంచిపేరుతో పోదామన్నా మనమందరం. త్యాగం అన్నా… టాలెంట్ ను చంపొద్దు అన్నా. మీరంతా మంచివారు. దయచేసి నా విజ్ఞప్తిని పరిశీలించండి’ అని శ్రీరెడ్డి పేర్కొంది.

తాము అమ్మాయిలమని, అంగట్లో సరుకులం కాదంటూ మరో పోస్టు పెట్టింది. అలాగే ఇండియన్ ఐడల్ శ్రీరామ్, అభిరామ్ గురించి కూడా ఓ పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి.. ‘ఇండియన్ ఐడల్ శ్రీరామ్, అభిరామ్ మీరిద్దరూ రాముడు పేరు పెట్టుకుని.. ఛీ.. ఛీ’ అని వ్యాఖ్యానించింది. కాస్టింగ్ కౌచ్‌పై పలువురి పేర్లను శ్రీరెడ్డి ఇప్పటికే బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజా పోస్టులపై నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇంతకాలానికి శ్రీరెడ్డి పోరాటం మరో మలుపు తిరిగిందని, ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు కనకదుర్గగా మారిందని కామెంట్ చేస్తున్నారు.

‘సినిమా ఇండస్ట్రీలో తెలుగు మహిళల పట్ల జరుగుతున్న అన్యాయం , అవమానాలు , వ్యభిచారంలు , చాల బాధాకరం, తెలుగు సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మన తెలుగు రాష్ట్రాలు, అలాంటిది. ఈ సినిమా పెద్దలు ఆధిపత్యంతో ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారు, సభ్య సమాజంలో తెలుగు మహిళలకు ఉన్న గౌరవాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, కేవలం ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలకు వారి పిల్లలకు డబ్బు కావాలి సుఖము కావాలి స్త్రీల తో ఆడుకుంటున్నారు, సినిమా ఇండస్ట్రీ అంటేనే రెండో డేరా బాబాలా ఉన్నాయ్’ అంటూ ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ ఆలోచించేదిగా ఉంది.

Kula rajakeeyalu vadhanna.. aada pillalanna..bhathakanidhamanna papam..dil raju(reddy) garu please sankellu vesina…

Posted by Sri Reddy on Tuesday, 10 April 2018

Comments

comments

Share this post

scroll to top