సంగీతం దేవుడిచ్చిన వరం. అది అందరికీ రాదు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక స్వరం పలికే ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు. కొన్నేళ్లుగా ఎస్పీబీ టాలీవుడ్, కోలివుడ్, బాలీవుడ్‌ను ఏలారు. ఆ తర్వాత రెహమాన్ వచ్చాక ఆయన గాత్రానికి కొంత బ్రేక్ వేశాడు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాడు. గాయనీ గాయకులను పరిచయం చేశాడు. చాలా మంది అన్ని రంగాల్లో టాప్ లో నిలిచారు. జీ టీవీ ఛానల్ సరిగమప పేరుతో నిర్వహించిన ప్రోగ్రాం భారీ వ్యూవర్స్‌ను తీసుకు వచ్చేలా చేసింది. వేలాది మంది దీని ద్వారా పరిచయం అయ్యారు. దీనిని సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో నిర్వహించారు. మిగతా ఛానల్స్ అన్నీ పాటల టాలెంట్‌ను గుర్తించాయి. రామోజీరావు సమర్పణలో వస్తున్న స్వరాభిషేకం బెస్ట్ కార్యక్రమంగా పేరు తెచ్చుకుంది. అద్భుతమైన గాత్రాలతో అలరిస్తూ సినిమా అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు.
అయితే ఈ స్పీడ్ ట్రాక్ యుగంలో ఎవరు పాడుతున్నారో అర్థం కావడం లేదు. ఒకప్పుడు అన్ని పాటలు ఒకరిద్దరే పాడే వారు. సరిగా గుర్తు పెట్టుకునేందుకు వీలుండేది. ఇపుడు అలా కాదు ..రోజుకు వందల్లో టాలెంట్ ఉంటోంది. తెలుగు సినిమా కొత్త వారికి స్వాగతం పలుకుతోంది. కొత్త నీరు వచ్చి చేరుతోంది. పాత నీరు వెనక్కి వెళుతోంది. జనం . సునీత, చిన్మయి శ్రీపాద లాంటి వాళ్లు తక్కువ టైంలో ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. యంగ్ టాలెంట్ ఊహించని రీతిలో ప్రతిభా నైపుణ్యానికి నగిషీలు చెక్కుతూ టాలెంట్‌ను పీక్ స్టేజ్‌కు తీసుకెళుతున్నారు.
టాలీవుడ్‌ను కొత్త టాలెంట్ ఏలుతోంది. కోట్లు కురిపించేలా చేస్తోంది. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పంచ్ లు ప్రాసలతో మంటలు రేపేలా డైలాగ్స్, లవ్ రొమాంటిక్ సీన్స్ తో పాటు క్లైమాక్స్ , మనసు దోచుకునేలా ..గుండెలు పిండేసేలా పాటలు తెలుగు సినిమా ప్రపంచాన్ని గుప్పిట బిగించేలా చేస్తున్నాయి. ఊపిరి తీసుకోనీయడం లేదు.
గత 10 ఏళ్లుగా టాలీవుడ్ లో న్యూ వేవ్ ప్రారంభమైంది. ఈ ఏడాది అర్జున్ రెడ్డి, టాక్సీ వాలా, గీత గోవిందం, ఫిదా లాంటి సినిమాల పాటలు టాప్ రేటింగ్స్‌లో నిలిచాయి. అనంత్ శ్రీరాం , హరిరామ జోగయ్య శాస్త్రి, శ్రీమణి, కందికొండ, చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ లాంటి వాళ్లు మరోసారి తమ కలాలకు పదును పెట్టారు.
కొత్త సంగీత దర్శకులు, గాయనీ గాయకులు టాలెంట్‌తో యువతీ యువకుల మనసు దోచుకున్నారు. టాలీవుడ్లో పరుశురాం దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం ..మూవీలోని సాంగ్ టాప్ టెన్‌లో ఒకటో స్థానం చేరుకుంది. అలాగే టాక్సీవాలా సినిమా కూడా..అర్జున్ రెడ్డి, పడి పడి లేచె మనసుతో పాటు మరికొన్ని లో బడ్జెట్ మూవీస్ మ్యూజిక్ పరంగా హై పీచ్ కు చేరుకుంది.
ఇంకేం ఇంకేం కావాలే అంటూ సిద్ శ్రీరాం పాడిన పాట అతడిని టాప్ రేంజ్ లోకి తీసుకు వెళ్లింది. ఇటీవలే రిలీజ్ అయిన టాక్సీవాలోలో మాట వినదుగా..అంటూ ఆలాపించిన గాత్రం తెలుగు వారిని కట్టి పడేసింది. పడి పడి లేచే మనసు సినిమాలో పాడిన ఏమైపోయావే.. నీ వెంటే నే నుంటే.. ఏమైపోతానే.. నీవంటూ లేకుంటే..అంటూ