నిన్న జరిగిన మ్యాచ్ ఆఖ‌ర్లో జ‌రిగిన ర‌చ్చ చూశారా..? హై డ్రామా వీడియో చూడండి..! [VIDEO]

క్రికెట్ మ్యాచ్‌లు అన్నాక ఒక్కోసారి అవి వ‌న్ సైడెడ్ అవుతుంటాయి. రెండు జ‌ట్ల‌లో ఏదైనా ఒక్క టీం మాత్ర‌మే అమోఘ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేస్తుంది. దీంతో ఆ జ‌ట్టునే విజ‌యం అల‌వోక‌గా వ‌రిస్తుంది. ఇక కొన్ని మ్యాచ్‌లు అయితే చివ‌రి బంతి వ‌ర‌కు ఉత్కంఠ‌ను రేపుతాయి. ఇరు జ‌ట్ల‌కు చెందిన ప్లేయ‌ర్స్ నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ప‌డి మ‌రీ ఆట ఆడుతారు. ఒక‌రిపై ఒక‌రు పై చేయి సాధిస్తుంటారు. దీంతో చివ‌ర‌కు ఎవ‌రో ఒక‌రికి విజ‌యం ద‌క్కుతుంది. కానీ ఇలాంటి మ్యాచ్‌ల‌లో అటు ఆడేవారికే కాక, చూసే వారికి కూడా టెన్ష‌న్ ఉంటుంది. అయితే ఇలాంటి టెన్ష‌న్‌ను రేపే మ్యాచ్‌ల‌లో చాలా వ‌ర‌కు వాటిలో చివ‌ర‌కు వివాదాలు కూడా అవుతుంటాయి. తాజాగా శ్రీ‌లంక‌తో బంగ్లాదేశ్ ఆడిన టీ20 మ్యాచ్ కూడా ఇలాగే చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ రేప‌గా ఇందులో చివ‌రి ఓవ‌ర్లో ర‌చ్చ ర‌చ్చ అయింది. బంగ్లా, శ్రీ‌లంక ప్లేయ‌ర్ల‌కు గొడ‌వ జ‌ర‌గ‌డంతో విష‌యం వివాదాస్ప‌ద‌మైంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

శ్రీ‌లంక‌లో భార‌త్‌, శ్రీ‌లంక‌, బంగ్లాదేశ్ జ‌ట్లు ముక్కోణ‌పు టీ20 సిరీస్ ఆడుతున్న విష‌యం తెలిసిందే క‌దా. ఇప్ప‌టికే భార‌త్ ఈ సిరీస్‌లో ఫైన‌ల్‌కు చేరుకోగా, మ‌రో బెర్త్ కోసం తాజాగా శ్రీ‌లంక‌, బంగ్లాదేశ్ జ‌ట్లు పోటీ ప‌డ్డాయి. మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీ‌లంక జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లకు 159 ప‌రుగులు చేయగా బంగ్లాదేశ్ 160 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంలో బ‌రిలోకి దిగింది. ఈ క్ర‌మంలో బంగ్లా జ‌ట్టు శ్రీలంక జ‌ట్టుకు చివ‌రి వ‌ర‌కు గ‌ట్టి పోటీనిచ్చింది. శ్రీ‌లంక ప్లేయ‌ర్లు ఎప్ప‌క‌టిప్పుడు బంగ్లా వికెట్లు తీశారు. అయిన చివరి ఓవ‌ర్ వ‌ర‌కు మ్యాచ్ ఉత్కంఠ‌గానే వ‌చ్చింది.

ఇక చివ‌రి ఓవ‌ర్‌గానే క్రీజులో బౌల‌ర్ ఎండ్ వైపు మ‌హ‌మ్మ‌దుల్లా ఉన్నాడు. అప్ప‌టికే బౌండ‌రీలు బాది మంచి జోరు మీదు ఉన్నాడు. ఇక స్ట్రైకింగ్‌లో ముస్తాఫిజుర్ ఉన్నాడు. చివ‌రి ఓవ‌ర్‌లో బంగ్లాదేశ్‌ 6 బంతుల‌కు 12 ప‌రుగులు చేయాల్సి వ‌చ్చింది. కాగా మొద‌టి బంతిని శ్రీ‌లంక బౌల‌ర్ ఉదానా షార్ట్ పిచ్ వేయ‌గా ముస్తాఫిజుర్ ఆడ‌లేక‌పోయాడు. త‌రువాత రెండో బంతిని కూడా ఉదానా అలాగే వేయ‌గా దాన్ని ఆడ‌లేని ముస్తాఫిజుర్ ర‌న్‌కు య‌త్నించి ఔట‌య్యాడు. అయితే ఒకే ఓవ‌ర్‌లో అలా రెండు షార్ట్ పిచ్ బంతుల‌ను వేస్తే రెండో బంతిని నోబాల్‌గా ప్ర‌క‌టించాలి. కానీ లెగ్ అంపైర్ అలా చేయ‌లేదు. దీంతో బంగ్లా ప్లేయ‌ర్లు అంపైర్లు, శ్రీ‌లంక ప్లేయ‌ర్ల‌తో మాట‌ల యుద్ధానికి దిగారు. ఈ క్ర‌మంలో బౌండ‌రీ బ‌య‌ట ఉన్న బంగ్లా కెప్టెన్ ష‌కీబ్ అల్ హ‌సన్ మ్యాచ్‌లో 4 బంతులు మిగిలి ఉండ‌గానే త‌మ ప్లేయ‌ర్ల‌ను బ‌య‌టికి వ‌చ్చేయ‌మ‌ని, ఆట ఇక ఆడేది లేద‌ని చెప్పాడు. దీంతో వారు మొద‌ట బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు య‌త్నించిన చివ‌ర‌కు అంపైర్లు స‌ర్ది చెప్ప‌డంతో బంగ్లా ప్లేయ‌ర్లు గ్రౌండ్‌లోనే ఉండి ఆట‌కు దిగారు.

అలా ఆట ఆరంభం కాగానే స్ట్రైకింగ్ లో ఉన్న మ‌హ‌మ్మ‌దుల్లా మూడో బంతిని బౌండ‌రీకి త‌ర‌లించాడు. 4 ప‌రుగులు వ‌చ్చాయి. దీంతో 3 బంతుల్లో 8 ప‌రుగులు బంగ్లా టీంకు అవ‌స‌రం అయ్యాయి. అనంత‌రం ఉదానా వేసిన నాలుగో బంతికి 2 ప‌రుగుల వ‌చ్చాయి. దీంతో 2 బంతుల్లో 6 ప‌రుగులు అవ‌స‌రం అయ్యాయి. ఇక 5వ బంతిని మ‌హమ్మ‌దుల్లా సిక్స‌ర్‌గా మ‌లిచాడు. దీంతో ఒక బంతి మిగిలి ఉండ‌గానే బంగ్లా జ‌ట్టు శ్రీ‌లంక‌పై అద్భుత‌మైన విజ‌యం సాధించింది. అయితే జ‌ట్టు విజ‌యం సాధించ‌డంతో బంగ్లా ప్లేయ‌ర్లు త‌మ ఎమోష‌న్‌ను ఆపుకోలేక‌పోయారు. అంత‌కు ముందే జ‌రిగిన సంఘ‌ట‌న‌ను దృష్టిలో ఉంచుకుని వారు శ్రీలంక ప్లేయ‌ర్ల‌ను ఇబ్బందుల‌కు గురి చేసేలా కోబ్రా డ్యాన్స్ చేశారు. దీంతో శ్రీ‌లంక ప్లేయ‌ర్లు ప‌లువురు బంగ్లా ప్లేయ‌ర్ల‌తో మ‌ళ్లీ వాగ్యుద్ధానికి దిగారు. చివ‌ర‌కు ఎలాగో అంతా స‌ద్దుమ‌ణిగింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆఖ‌ర్లో జ‌రిగిన ఈ డ్రామాకు చెందిన‌ వీడియో వైర‌ల్‌గా మారింది..! ఏది ఏమైనా.. ఆట అన్నాక ఇలాంటివ‌న్నీ స‌హ‌జం. కానీ కొంద‌రు ప్లేయ‌ర్స్ మాత్రం త‌మ కంట్రోల్‌ను కోల్పోయి ఇలా ప్ర‌వ‌ర్తిస్తారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌ళ్లీ మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా సంబంధిత అధికారులు చూడాల్సిందే.

Comments

comments

Share this post

scroll to top