సూర్య “24” సినిమాను చూశారా? ఇదిగో మీకోసం.. విత్ యాడెడ్ ఫుల్ ఫన్.!

PK సినిమాతో అమీర్ ఖాన్ , బాహుబలి సినిమాతో జక్కన్న…బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను తిరగరాశారు. అవే కథాంశాలను తీసుకొని వాటికి పేరడీలను చేస్తూ ఓ యువ దర్శకుడు యూట్యూబ్ వేదికగా  సంచలనాలకు తెరతీశాడు. అప్పటి వరకు యూట్యూబ్ లో చాలానే కామెడీ షార్ట్ ఫిల్మ్స్ వచ్చేవి…అవన్నీ ఒక ఎత్తు..ఈ యంగ్ డైరెక్టర్  తీసే కామెడీ షార్టీలు ఓ ఎత్తు. ఎందుకంటే….బాక్స్ ఆఫీస్ రికార్డులను షేక్ చేసిన సినిమాలలోని మూలకథను తీసుకొని దానిని పేరడీ చేసి, స్టోరీ ఫీల్ ను దెబ్బతీయకుండా…అవుట్ అండ్ అవుట్ కామెడీని పంచడం అంటే మామూలు మాటలు కాదు. అలాంటి సాహసాలు చేసి సక్సెస్ అవ్వడంలో  ఈ యంగ్ డైరెక్టర్ ది అందెవేసిన చెయ్యి..  ఓ మంచి సినిమా విడుదలయ్యిందంటే చాలు…బాసూ నీ స్పూఫ్ ఎప్పుడూ? అంటూ… ఈ డైరెక్టర్  ఫేస్ బుక్ ఇన్ బాక్స్ లో   ప్రశ్నలను సంధిస్తారు ఫ్యాన్స్…దీనిని బట్టి తెలుసుకోవొచ్చు మనోడి స్పూప్స్ కు జనాల్లో ఎంత క్రేజో.

PK తో మొదలు……..

అమీర్ ఖాన్ PK స్పూఫ్  తో మొదలైన డైరెక్టర్  శ్రీకాంత్ రెడ్డి పేరడీల ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంది. కేవలం కామెడీని దించడమే కాకుండా…ఫన్ తోనే మంచి మెసేజ్ ను ఇచ్చే ప్రయత్నం చేశాడు PK స్పూఫ్ లో…… చెట్లు నాటకుంటే మానవజాతి మనుగడ  అసాధ్యం అని దాని వైపరిత్యాలను హాస్యాన్ని జోడించుకుంటూ చెప్పడం అత్యధ్బుతం.

ఇక బాహుబలి -2 అంటూ చేసిన స్పూఫ్ లో బాహుబలి  పార్ట్ 2 కథను ప్రెడిక్ట్ చేస్తూ…దానిని డీల్ చేసిన విధానం చాలా మంది నెటీజన్లకు నచ్చడమే కాకుండా…ఓ ప్రముఖ అవార్డ్ ను కూడా సాధించి పెట్టింది. ఈ షార్టీలో  తెలంగాణ యాసలో పలికించిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

ఇక PK, బాహుబలి పరంపరలో…ఇప్పడు ఈ డైరెక్టర్ డైరెక్షన్లో విడుదలైన మరో స్పూఫ్… 24 2, సూర్య 24 కు పేరడీగా దీన్ని తెరకెక్కించాడు దర్శకుడు. గడియారం చేసే మాయాజాలన్ని మరింత ఫన్నీగా చూపించారు ఇందులో. ముఖ్యంగా ఈ సినిమాలో సూర్య పాత్రలో నటించిన వ్యక్తి యాస్ ఇట్ ఈస్ సూర్యానే దించేశాడు.

Watch 24 2 Short Film:

ఈ దర్శకుడి ఇతర పేరడీలు:

PK Spoof:

బాహుబలి Spoof:

Comments

comments

Share this post

scroll to top