బాహుబలి లో శ్రీహరి ఉండుంటే?

షేర్ ఖాన్ గా మగధీర లో తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసిన శ్రీహరిని  బాహుబలి లో మనం మిస్సయ్యాం.  మగధీర లోని రెండు పాత్రలలో నటించిన శ్రీహరి తెలుగు ప్రేక్షకులను అలరించారు. షేర్ ఖాన్ పాత్ర అయితే ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది, ఇంకా రియల్ స్టార్ షేర్ ఖాన్ రోల్ లో చెప్పిన డైలాగ్ లు అయితే  చిరస్థాయిలో నిలిచిపోయాయి. హీరో పాత్ర తర్వాత అంతగా అలరించిన పాత్ర శ్రీహరి ది.

సేమ్ దర్శకుడు, అదే కెమెరామాన్, అదే ఫైట్ మాస్టర్… తారాగణాన్ని తప్పిస్తే సేమ్ టు సేమ్ అదే టెక్నికల్ టీమ్ తో రూపొందిచిన చిత్రం బాహుబలి,  ఈ సమయంలో కనుక శ్రీహరి బతికుంటే రాజమౌళి  శ్రీహరికి కచ్చింతగా ఓ పాత్ర ను ఇచ్చేవాడు తన బాహుబలి సినిమాలో… ఎందుకంటే జక్కన్నకు తెలుసు శ్రీహరిని ఏ పాత్రకు ఎలా వాడుకోవాలో.

అయితే శ్రీహరి బతికుండుంటే బాహుబలి లో ఏ పాత్ర ను ఇచ్చేవారని చాలా మంది అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. రానా పాత్రను రాజమౌళి శ్రీహరికి  ఇచ్చేవాడని కొందరు, సుదీప్  పాత్రను ఇచ్చేవారని ఇంకొందరు అంటున్నారు. ఏ పాత్ర ఇచ్చినా ఇరగదీసేవారు రియల్ స్టార్.

మొత్తానికి ఓ మంచి నటుడిని చిత్రసీమ కోల్పోయింది ఎంత నిజమో, బాహుబలి లాంటి సినిమాలో షేర్ ఖాన్ లాంటి  శ్రీహరిని కోల్పోయి చాలా బాధపడుతున్నాం మా లాంటి సగటు అభిమానులం.. RIP శ్రీహరి గారు, We Miss You  షేర్ ఖాన్.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top