చనిపోయిన తర్వాత “శ్రీదేవి” అకౌంట్ నుండి ట్వీట్..! ఎవరు చేసారో తెలుసా.? ఏమన్నారంటే..?

దుబాయ్ లోని బంధువల ఇంటికి పెళ్లికి వెళ్లిన అతిలోక సుందరి శ్రీదేవి అటు నుండి అటే అనంతలోకాలకి వెళ్లింది..అటు సినిమా ప్రపంచాన్ని,అభిమానులను..ఇటు కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసి దేవలోకానికి వెళ్లి పోయింది.ఎన్నో అనుమానాల మధ్య శ్రీదేవి మృతి,అంత్యక్రియలు ముగిశాయి.ప్రపంచానికి తను అందాలనటి కావచ్చు..కాని తన భర్త బోణి కపూర్ కి ఆమె సర్వస్వం,తన ఇద్దరు పిల్లలను కంటికిరెప్పలా కాచుకున్న కన్నతల్లి.. సడన్ గా మన మధ్య నుండి మాయమైన శ్రీదేవి గురించి తన మరణం తర్వాత బోణి కపూర్ ట్వీట్ చేశారు..అది చదివే అందరిని మరోమారు శ్రీదేవి మరణవార్త కలచివేస్తుంది..

తొలిచూపులోనే శ్రీదేవి ప్రేమలో పడ్డారు బోణి కపూర్.అదే విషయాన్ని శ్రీదేవికి చెప్పే ధైర్యం చేయలేకపోయారు.కాని శ్రీదేవి తల్లి మాత్రం బోణిలాంటి అబ్బాయినే శ్రీదేవికి ఇచ్చి పెళ్లి చేయాలని అంటూ ఉండేదట..ఆ తర్వాత శ్రీదేవి తల్లి రాజేశ్వరి అనారోగ్యంతో మరణిస్తే అప్పుడు బోణినే శ్రీదేవికి అండగా ఉన్నారు.ఒంటరిగా ఉన్న శ్రీదేవికి అన్ని తానై నిలిచారు..తన ప్రేమ విషయం చెప్తే శ్రీదేవి  అంగీకరించడం,ఇద్దరు పిల్లలు కలగడం..తర్వాత కుటుంబం కోసం శ్రీదేవి తన నటనకు దూరం కావడం అన్ని చకచకా జరిగిపోయాయి..సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రేక్షకులలో అలనాటి శ్రీదేవి నటన,అందం ఇంకా అలాగే ఉంటున్నాయి అనుకుంటున్న తరుణంలో మన మధ్య నుండి వెళ్లిపోవడం బాదాకరం.శ్రీదేవితో తన అనుబందాన్ని గురించి   ట్వీట్ చేశారు బోణి

‘ఆమె ఈ ప్రపంచానికి చాందినీ.. నాకు మాత్రం ఆమే సర్వస్వం.. నా ప్రేమ. ఓ స్నేహితురాలు, భార్య, ఇద్దరు కూతుళ్ల తల్లిని కోల్పోయాను. ఆమె లేని లోటు మాటల్లో వర్ణించలేను’

అని  అంత్యక్రియలు పూర్తయిన అనంతరం శ్రీదేవి ట్వీటర్‌ ఖాతా నుంచి ఆయన ట్వీట్‌ చేశారు. శ్రీదేవి మృతిచెందిన తర్వాత ఆమె ట్వీటర్ నుంచి పోస్టయిన తొలి ట్వీట్ ఇది.శ్రీదేవి ట్వీటర్ నుంచి పోస్ట్ అయిన ట్వీట్ వేల రీట్వీట్లు, లైక్స్‌తో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శ్రీదేవి వెండితెరపై ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. నేడు భౌతికంగా ఆమె మన మధ్య లేదు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌లో రాసుకొచ్చారు బోనీ కపూర్.‘ఈ బాధాకర సమయంలో అర్జున్ కపూర్, అన్షులు నా వెంట నిలబడి.. నాకు, జాన్వికి, ఖుషికి ఎంతో ధైర్యాన్నిచ్చారు’ అని ట్వీట్‌ చేశారు. తన ఇద్దరు కూతుళ్లు జాన్వి, ఖుషిలను జాగ్రత్తగా చూసుకోవడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. సినీ తారల జీవితానికి తెర పడదని, వెండితెరపై వారెప్పుడూ సజీవంగానే ఉంటారని శ్రీదేవి మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్న భర్త బోనీ కపూర్ అన్నారు.

Comments

comments

Share this post

scroll to top