శ్రీదేవి మృతి కేసు మూసివేత..! 60 గంటలు కేసు ఎన్నో మలుపులు తిరిగాక ఫైనల్ గా ఏం చెప్పారంటే..?

రెండున్నర రోజుల హైడ్రామా తర్వాత మొత్తానికి శ్రీదేవి మృతి కేసును మూసేశారు దుబాయ్ పోలీసులు. దాదాపు 60 గంటల పాటు ఎన్నో మలుపుల మధ్య ఎంతో ఉత్కంఠ రేపిన ఈ కేసులో విచారణ మొత్తం పూర్తయినట్లు పోలీసులు స్పష్టంచేశారు. ఈ మేరకు ఈ ప్రమాదవశాత్తు మృతి కేసును మూసేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం శ్రీదేవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడానికి దుబాయ్ పోలీసులు అంగీకరించిన విషయం తెలిసిందే. సోమవారమే ఫోరెన్సిక్ నివేదిక వచ్చినా.. దాని ప్రకారం దుబాయ్ పోలీసులు ఈ కేసును దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. వాళ్లు తదుపరి విచారణను పూర్తిచేశారు. ఆమె మృతి ప్రమాదవశాత్తూ జరిగినట్లు నిర్ధారించుకున్న తర్వాత కేసును మూసేస్తున్నట్లు దుబాయ్ మీడియా ఆఫీస్ వెల్లడించింది.

Comments

comments

Share this post

scroll to top