“శ్రీదేవి” కుటుంబంతో “అంబానీ”కి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా.? ప్రైవేట్ జెట్ పంపింది అందుకేనా.?

అతిలోక సుందరి శ్రీదేవి ఇక లేరు… బందువుల ఇంటికి పెళ్లికి వెళ్లిన ఆమె తిరిగిరాని అనంతలోకాలకు తరలి వెళ్లారు.ఎంతో మంది అభిమానులను,తన కుటుంబాన్ని శోకసముద్రంలో ముంచి వెళ్లారు..కన్నకూతుర్లకు తన తోడు అవసరం అయిన సమయంలో అందకుండా అందనంత దూరానికి వెళ్లిపోయారు..గత ఐదురోజులుగా ఎవరినోటివెంట విన్నా శ్రీదేవి గురించిన విషయమే..శ్రీదేవి మృతదేహాం దుబాయ్ నుండి ఇండియాకు తీసుకురావడానికి అంబాని తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు..కాని ఇక్కడ మనకు తెలియని ఇంకొక విషయం ఉంది…

మేనల్లుడి వివాహ వేడుక కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడే హోటల్ గదిలో ప్రాణాలు వదిలిన సంగతి మనకు తెలిసిందే. శ్రీదేవి మరణంపై అనేక అనుమానాలు తలెత్తినప్పటికీ.. చివరకు ఆమె బాత్‌టబ్‌లో పడిపోయి, స్పృహ కోల్పోవడం వల్లే చనిపోయారని దుబాయ్ అధికారులు తేల్చారు. శనివారం రాత్రి ఆమె మరణించగా.. మంగళవారం రాత్రి ఆమె భౌతిక కాయాన్ని ప్రయివేట్ జెట్‌లో ముంబై తీసుకొచ్చారు. 13 మంది కూర్చోగల సామర్థ్యం ఉన్న ఈ జెట్‌ను పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సమకూర్చారు.శ్రీదేవి భౌతికకాయం తరలింపు కోసం అనిల్ అంబానీ తన జెట్‌ను సమకూర్చడానికి ముఖ్య కారణం ఇరు కుటుంబాల మధ్య బంధుత్వం ఉండటమే.

బోనీ కపూర్ మేనల్లుడు మోహిత్ మర్వా పెళ్లి వేడుకల్లో పాల్గొనడం కోసం శ్రీదేవి కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే.బోనీ కపూర్ సోదరి రీనా మార్వా కుమారుడైన మోహిత్ మార్వా.. అంతరా మోతివాలాను పెళ్లాడారు. అంతర.. అనిల్ అంబానీ భార్య టీనాకు స్వయానా అక్క కూతురు. వీరి పెళ్లితో అంబానీలకు బోనీ కపూర్ ఫ్యామిలీతో దగ్గరి సంబంధం ఏర్పడింది. శ్రీదేవి పార్థీవ దేహాన్ని దుబాయ్ నుంచి ముంబై తీసుకు రావడానికి అనిల్ అంబానీ తన జెట్‌ను సమకూర్చడానికి ఇది కూడా ఓ కారణమే…

Comments

comments

Share this post

scroll to top