“శ్రీదేవి” గురించి చాలామందికి తెలియని షాకింగ్ నిజం ఇదే..! ఆమె తల్లి సొంత ఊరు ఏదంటే.?

అతిలోక సుందరి శ్రీదేవి మూలాలు తిరుపతిలోనే ఉన్నాయి. ఆమె తల్లి రాజేశ్వరమ్మ సొంతూరు తిరుపతి. తాత కటారి వెంకటస్వామిరెడ్డి తిరుపతి-గ్యారపల్లి-జమ్మలమడుగు మధ్య బస్సులు నడిపేవారు. ఆయన జమ్మలమడుగులో నర్సుగా పనిచేస్తున్న వెంకటరత్నమ్మను ప్రేమించి కులాంతర (బలిజ) వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన రుయా ఆసుపత్రిలో ఉద్యోగం సంపాదించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. పెద్ద కుమారుడు బాల సుబ్రహ్మణ్యం కాగా, తర్వాత రాజేశ్వరమ్మ, సుబ్బరామయ్య, అనసూయమ్మ, అమృతమ్మ, శాంతమ్మ జన్మించారు. అందరూ తిరుపతిలోని 93-టీకే వీధిలోని ఇంట్లో ఉండేవారు. బాలసుబ్రహ్మణ్యం చెన్నైలో ఉద్యోగం సంపాదించారు.
తనవెంట తమ్ముడు, చెల్లెళ్లందర్నీ చెన్నై తీసుకెళ్లాడు. రాజేశ్వరమ్మకు సినీ నటి కావాలన్న తపన ఉండేది. మిగతా వాళ్లంతా ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆమె నటిగా ప్రయత్నిస్తూ రంగారావు అనే చిన్నస్థాయి నటుడిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి సూర్యకళ అనే కుమార్తె కలిగింది. రంగారావు హఠాత్తుగా అదృశ్యమయ్యారు. అనంతరం రాజేశ్వరమ్మ శివకాశికి చెందిన తెలుగువాడు అయ్యప్పన్‌ రెడ్డిని వివాహం చేసుకున్నారు. సూర్యకళను అమ్మమ్మ, తాతయ్యలు తెచ్చి పెంచుకున్నారు. అప్పటికే అయ్యప్పన్‌రెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు. అయ్యప్పన్‌రెడ్డి చెన్నైలో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసేవారు. ఆయన తన భార్యను ఒప్పించి రాజేశ్వరమ్మను వివాహం చేసుకున్నారు.
రాజేశ్వరమ్మకు ఇద్దరు కుమార్తెలు… శ్రీదేవి, శ్రీలత కలిగారు. అయ్యప్పన్‌రెడ్డి మరణించిన తర్వాత కూడా ఆయన కుమారుడే ఇంటి వ్యవహారాలు చూసుకొనేవాడు. శ్రీదేవి దక్షిణాదిన తారాపథంలో దూసుకుపోతున్నపుడు కూడా అన్న చెప్పినట్లే నడుచుకొనే వారు. శ్రీలతను మధురైకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంజీవ్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. శ్రీదేవి అక్క సూర్యకళను రాజేశ్వరమ్మ మేనత్త కుటుంబంలో (ఎ.రంగంపేట) ఇచ్చి వివాహం చేశారు. సూర్యకళ కుమార్తె గులాబీ సినిమా హీరోయిన్‌ మహేశ్వరి. ఎ.రంగంపేటలో 1970లో శ్రీదేవి పది రోజులపాటు గడిపిందట. శ్రీదేవిని పసిబిడ్డగాఉన్నప్పటి నుంచి పిన్ని అనసూయమ్మే పెంచింది. ఇప్పుడామె తిరుపతిలో ఉన్నారు.
శ్రీదేవి ఏటా ఆగస్టు 13న పుట్టినరోజును తిరుమల వేంకటేశ్వరుని సన్నిధిలో జరుపుకొనే వారు. శ్రీదేవి పిన్ని కుమార్తె ప్రసన్నలక్ష్మి స్విమ్స్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌. శ్రీదేవి తిరుపతి వస్తే ఆమె ఇంట్లోనే ఉండేవారు. శ్రీదేవికి బోనీకపూర్‌తో వివాహం జరిగినప్పటి నుంచి శ్రీదేవికి బంధువులతో ఎడం పెరిగింది. తల్లి రాజేశ్వరమ్మ బ్రెయిన్‌ ఆపరేషన్‌ సమయంలో జరిగిన పొరపాటుకు అమెరికా ఆసుపత్రి నుంచి భారీ పరిహారం వచ్చింది. దాని విషయంలో శ్రీదేవి, శ్రీలత మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. తర్వాత ఒక్కటయ్యారు. గత పదేళ్లలో మహేశ్వరి వివాహంతో పాటు మరికొన్ని వేడుకలకు మాత్రమే శ్రీదేవి వచ్చారు.
తిరుపతికి శ్రీదేవికి విడదీయలేని బంధం ఉంది. ఆమెకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి అంటే విపరీతమైన భక్తి. తక్కువలో తక్కువ ప్రతి ఏటా స్వామివారి దర్శనం చేసుకోకుండా ఉండలేరు. తన బర్త్ డేకు ముందు కానీ.. తన సినిమా విడుదలకు ముందు కానీ.. ఏదైనా ముఖ్యమైన పని మొదలు పెట్టటానికి ముందు తిరుమల శ్రీవారి వద్దకు వచ్చి ఆయన దర్శనం చేసుకోవటం శ్రీదేవికి అలవాటు. తిరుమల శ్రీవారి సన్నిధికి వచ్చిన ప్రతిసారీ స్వామివారి దర్శనాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకునే శ్రీదేవికి సుప్రభాత సేవ అంటే చాలా ఇష్టంగా చెబుతారు. గత ఏడాది జూన్ 24న శ్రీదేవి స్వామివారి దర్శనం చేసుకున్నారు.మామ్ చిత్రం జులై 7న విడుదల కాగా.. అంతకు కొద్దిరోజుల ముందు (జూన్ 24) తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అదే ఆమె చివరి దర్శనంగా చెప్పాలి.

Comments

comments

Share this post

scroll to top