బయటకొచ్చిన అసలు నిజం..శ్రీదేవి ఇలా చనిపోయింది.! 8.30 కి భార్యను నిద్రలేపి డిన్నర్ చేద్దామని బోని.!

శ్రీదేవి మృతి మిస్టరీ అంటూ కొందరు రాద్దాంతం చేస్తున్నారు. ఏం జరిగింది.. ఎలా జరిగింది అనేదానిపై పలు రకాల కథనాలు, వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వీటిన్నింటికీ సమాధానం చెప్పారు భర్త బోనీకపూర్. అసలు ఆ రోజు ఏం జరిగిందో వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీదేవి మేనల్లుడి పెళ్లి కోసం నేను, శ్రీదేవితోపాటు చిన్న కూతురు ఖుషీ దుబాయ్ వెళ్లినట్లు చెప్పారు.

పెళ్లి అయిన వెంటనే భర్త బోనీకపూర్ కూతురిని తీసుకుని ముంబై తిరిగి వచ్చేశారు. శ్రీదేవితోపాటు చెల్లి శ్రీలత దుబాయ్ లోనే ఉన్నారు. తన భార్యను సర్ ప్రైజ్ చేసేందుకు బోనీకపూర్ శనివారం సాయంత్రం మళ్లీ దుబాయ్ వెళ్లారు. శ్రీదేవి బస చేసిన జువైరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్ చేరుకున్నారు. అలా వెళ్లిన భర్త.. ఇలా తిరిగి రావటంతో నిజంగా సర్ ప్రైజ్ అయ్యింది శ్రీదేవి. ఇద్దరూ కొద్దిసేప మాట్లాడుతుకున్నారు. అప్పుడు టైం సాయంత్రం 5.30 గంటలు. ఆ తర్వాత శ్రీదేవి నిద్రపోయింది.

రాత్రి 8.30 గంటల సమయంలో (దుబాయ్ టైమింగ్స్) భార్యను నిద్రలేపాడు. డిన్నర్ చేద్దామని చెప్పాడు. రెడీ అయ్యి వస్తానంటూ బాత్ రూంకి వెళ్లింది. 15 నిమిషాలు అయినా బయటకు రాలేదు. పిలిచినా పలకలేదు. తలుపుకొట్టినా ఉలుకూ పలుకూ లేదు. దీంతో తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూశాడు. నిండా నీళ్లున్న బాత్ డబ్ లో అచేతనంగా పడి ఉంది శ్రీదేవి. అంతే షాక్. వెంటనే దుబాయ్ లోని స్నేహితుడికి ఫోన్ చేశాడు. హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చి.. వెంటనే రషీద్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు చెప్పారు డాక్టర్లు. ఆ తర్వాత 9 నుంచి 9.30 గంటల మధ్య పోలీసులకు సమాచారం ఇచ్చారు.

watch video here:

Comments

comments

Share this post

scroll to top