శ్రీదేవి డెత్ మిస్టరీ లో మరో ట్విస్ట్.! సన్నిహితులే హత్య చేశారని పంచాంగ శ్రవణంలో సంచలన వ్యాఖ్యలు.?

దివంగత నటి శ్రీదేవి మరణం మళ్లీ వార్తల్లోకెక్కింది..శ్రీదేవి హత్యకు గురైందని శ్రీకాళహస్తి దేవస్థాన ఆస్థాన పండితుడు ములుగు రామలింగేశ్వర వర ప్రసాదు సిద్ధాంతి తెలిపారు. శ్రీదేవిది సహజ మరణం కాదని, ఆమెను సన్నిహితులే హత్య చేశారని ఆయన పంచాంగ శ్రవణంలో  సంచలన వ్యాఖ్యలు చేయడంతో  శ్రీదేవి మరణవార్త మళ్లీ తెరపైకి వచ్చింది.మరోవైపు మహారాష్ట్ర నవనిర్మాణ సమితి అధ్యక్షుడు రాజ్ థాక్రే కూడా శ్రీదేవి మరణం గురించి ప్రస్తావించారు..

శ్రీదేవిది సహజ మరణం కాదని.. ఆమెది హత్య అని ..శీదేవిని సన్నిహితులే చంపారని.. ఆమె సహజంగా చనిపోలేదని అన్నారు ములుగు రామలింగేశ్వర వరప్రసాదు సిద్దాంతి.దుబాయ్ లో మేనల్లుడి వివాహానికి వెళ్లిన శ్రీదేవి అక్కడే మరణించిన విషయం తెలిసిందే..తొలుత గుండె పోటు తో చనిపోయిందని భావించడంతో, ఈ విషయంలో భర్త బోణి కపూర్ ని విచారించారు,పెళ్లికి వచ్చిన అతిదుల వివరాలను సేకరించారు..చివరికి బాత్ టబ్ లో మునిగిపోవడం వలన శ్రీదేవి చనిపోయిందంటూ దుబాయ్ ప్రభుత్వం పోస్టుమార్టమ్ సర్టిఫికెట్ ఇచ్చింది.. ఎన్నో అనుమానాల మధ్య శ్రీదేవి భౌతికకాయం దుబాయ్ నుండి ఇండియాకు వచ్చింది.యావత్ భారతాన్ని దుంఖ: సంద్రంలో ముంచి అతిలోక సుందరి అనంతలోకాలకు వెళ్లిపోయింది..శ్రీదేవి చనిపోయి దాదాపు నెల కావస్తుంది.ఇప్పుడిప్పుడే వారి కుటుంబం ఈ విషయాన్ని దిగమింగడానికి ప్రయత్నిస్తుంది.ఈ క్రమంలో ములుగు సిద్దాంతి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి..

ఇదే సమయంలో మహారాష్ట్ర నవనిర్మాణ పార్టీ అధినేత రాజ్ థాక్రే కూడా శ్రీదేవి ఇష్యూను ప్రస్తావించారు. ఆమె భౌతికకాయంపై త్రివర్ణపతాకం ఎందుకు ఉంచారని.. అధికార లాంఛనాలతో ఎందుకు అంత్యక్రియలు నిర్వహించారని మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే.. బీజేపీ రాద్దాంతం చేసేదన్నారు. మీడియా సైతం ఈ విషయంలో నోరుమెదపకపోవటం విడ్డూరం అన్నారు. శ్రీదేవి అంటే గొప్పనటిగా అందరికీ అభిమానం ఉందని.. దేశానికి ఏం చేశారో చెప్పాల్సిన అవసరం కూడా ఉందన్నారు…

ఈ రెండు అంశాలతో ఇఫ్పుడిప్పుడే  సద్దుమనుగుతున్న శ్రీదేవి మరణ వార్త మళ్లీ వివాదస్పదమవుతుంది.ఇప్పటివరకూ అర్దాంతరంగా మరణించిని నటీనటుల మరణాల గురించిన నిజానిజాలేవి బయటికి తెలియలేదు..శ్రీదేవి మరణం గురించి ఏం జరుగుతుందో చూద్దాం..

 

Comments

comments

Share this post

scroll to top