ఆ సినిమాలో ఓ సీన్ లో “శ్రీదేవి” కి డూప్ గా ఆక్ట్ చేసింది ఎవరో తెలుసా.? మనందరికీ తెలిసిన ఆ తెలుగు ఆర్టిస్ట్ ఎవరంటే.?

సినిమాల్లో హీరోలకు డూప్ లు గా నటిస్తారనే విషయం మనకు తెలుసు..ఎక్కువగా ఏదైనా రిస్కీ షాట్స్ లో ..ఫైట్ సీన్స్ లలో..డబుల్ రోల్ చేసినప్పుడు హీరోలకు డూప్ అవసరం ఉంటుంది..కానీ హీరోయిన్లకు కూడా డూప్ అవసరం ఉంటుందని ఎప్పుడన్నా విన్నారా..కాని హీరోయిన్లకు కూడా డూప్ లుగా చేస్తుంటారట కొందరు.అలా అతిలోకసుందరి శ్రీదేవికి డూప్ గా ఒక సినిమాలో నటించిన నటి ఎవరు..ఏ సినిమానో తెలుసా..?

‘జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి’ సినిమా చేస్తున్న‌ప్పుడు శ్రీ‌దేవికి కూడా ఓ సంద‌ర్భంలో డూప్ కావాల్సివ‌చ్చింది.అది కూడా కేవలం ఒకే ఒక సన్నివేశంలో… శ్రీ‌దేవి ఈత కొల‌నులో ఉంటే… అమ్రిష్ పురి వ‌చ్చే సీన్ ఉంటుంది.. గుర్తుందా? .. ఆ సీన్ చేసేటప్పుడు శ్రీదేవి స్థానంలో డూప్ గా నటించింది మనకు సుపరిచితురాలైన నటి హేమ. శ్రీ‌దేవికి ఈత రాకపోవడం మూలాన ఆస‌మ‌యంలో ఈత వ‌చ్చిన అమ్మాయి అవ‌స‌రం ఏర్ప‌డింది. స‌రిగ్గా అదే రోజున ఊటీలో మ‌రో సినిమా షూటింగ్ లో పాల్గొనడం కోసం హేమ వెళ్లింది.ఆ టీమ్‌లోంచి హేమ‌ని తీసుకొచ్చి.. శ్రీ‌దేవికి డూప్‌గా మార్చారు.

అలా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో శ్రీ‌దేవికి డూప్ గా న‌టించింది హేమ.ఈత కొల‌నులో ఉన్న సీన్లు చూడండి.. లాంగ్ షాట్‌లో ఉన్న‌ది హేమ‌నే. .  ఆ తర్వాత  శ్రీ‌దేవి- హేమ క‌ల‌సి మరో సినిమాలో నటించారు..అదే రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన   ‘క్ష‌ణ క్ష‌ణం’. అందులో శ్రీ‌దేవికి ఫ్రెండ్ గా నటించింది హేమ.సినిమాల్లోకి రావడానికి ఎందరికో స్పూర్తి అయిన శ్రీదేవితో నటించడం అంటే అందరికి గొప్పవిషయమే కదా..అందుకే శ్రీ‌దేవికి డూప్‌గా చేశాన‌ని ఇప్ప‌టికీ గొప్ప‌గా చెప్పుకుంటా అంటోంది హేమ‌.

 

Comments

comments

Share this post

scroll to top