జాహ్నవి జీవితం అలా కావద్దనే పెళ్లి ప్లాన్ చేసిన శ్రీదేవి..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

సూపర్ స్టార్ శ్రీదేవి బంధువల పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన అక్కడ హోటల్ గదిలోని బాత్ టబ్‌లో పడిపోయి ప్రమాద వశాత్తు మరణించిన విషయం తెలిసిందే. శ్రీదేవి మరణంతో అభిమాన లోకం,భారత సినీపరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది.తన కుటుంబానికి అయితే శ్రీదేవి లేని లోటు పూడ్చలేనిది.తన కెరీర్ ను వదులుకుని కుటుంబం కోసం,పిల్లల కోసం ఎంతో చేసింది శ్రీదేవి.కూతురు కెరీర్ కోసం ఎంతో ఆరాటపడిన శ్రీదేవి..జాన్వి తొలి సినిమా చూడకుండానే వెళ్లిపోవడం విషాదం.అయితే మొదట్లో జాన్విని హీరోయిన్ చేయాలనుకోలేదట శ్రీదేవి..మరేం అనుకుంది…

ఏ తల్లైనా తన బిడ్డలను గురించి ఏం కోరుకుంటుంది..బాగా చదువుకోవాలని ,చదువులయ్యాక పెళ్లి చేయాలని సూపర్ స్టార్ శ్రీదేవి కూడా తన పిల్లల విషయంలో దీనికి అతీతురాలు కాదు.నాలుగేళ్ల వయసులోనే నటించడం మొదలుపెట్టిన శ్రీదేవి పదమూడేండ్లకే హీరోయిన్ గా పరిచయం అయింది.చైల్డ్ ఆర్టిస్టుగా చేసేటప్పుడు రోజుకు నాలుగు షిప్టులు పనిచేసేది శ్రీదేవి..దాంతో చదువుకోవడానికి తీరిక దొరికేది కాదు ఎప్పుడైనా షూటింగ్ లేకపోతే ఒక టీచర్ ఇంటికే వచ్చి శ్రీదేవికి చదువు చెప్పేవారు.దాంతో శ్రీదేవికి ఇప్పటి వరకు చదువుకు సంభందించి ఎలాంటి సర్టిఫికెట్లు లేవు.

హీరోయిన్ గా తెరంగేట్రం చేశాక కూడా అన్ని భాషల్లో నటిస్తూ మరింత బిజీ అయిపోయింది.దక్షిణాది నుండి ఉత్తరాదికి ఎందరో హీరోయిన్లు వెళ్లారు.కాని బాలివుడ్లో స్టార్ హీరోలతో పోటీపడి సూపర్ స్టార్ గా నిలిచిన ఏకైక హీరోయిన్ శ్రీదేవి..తర్వాత లేటు వయసులో బోణికి రెండో భార్య కావడం,పిల్లల్ని కనడం..కుటుంబం కోసం,పిల్లల కోసం సినిమాలకు గుడ్ బై చెప్పడం జరిగింది.

మళ్లీ అదే కుటుంబానికి అండగా నిలబడడం కోసం ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు..శశిగా అందరిని కట్టిపడేసింది శ్రీదేవి నటన..అప్పుడే ఒక ఇంటర్వ్యూలో జాన్వి గురించి చెప్పింది శ్రీదేవి.తన పిల్లలను బాగా చదివించాలని,చదువులైపోగానే మంచి అబ్బాయిని చూసి  పెళ్లిచేయాలనుకుంటున్నట్టు  చెప్పింది. అందుకే పిల్లలను ముందునుండి సినిమాలకు దూరంగా పెంచింది.అంతేకాదు తను కోల్పోయిన బాల్యాన్ని పిల్లలకు దూరం చేయకూడదని ,తన జీవితంలో పొందలేని ఎన్నింటినో పిల్లలకు చేరువ చేయాలనుకుంది.. కాని జాన్వి సినిమాల్లోకి రావాలని కోరుకోవడంతో ఇటు వైపు తీసుకొచ్చింది.ఎన్నో సినిమా కథలు విన్నప్పటికి ఏవీనచ్చకపోవడంతో చివరికి మరాఠీ మూవీ సైరాట్ కథ నచ్చడంతో ఆ రీమేక్ లో జాన్వీని పరిచయం చేయడానికి ఒప్పుకుంది.కానీ ఆ సినిమా విడుదలవడానికి నాలుగునెలలుందనగా శ్రీదేవి దూరమవడం దురదృష్టం.

Comments

comments

Share this post

scroll to top