వెంకీ మామ నాకు పెళ్లి కార్డు ఇవ్వవా.? నేను మీ కోడల్నే గా !!

వెంకీ మామా నేను మీ కోడల్నే కదా… మరి నాకేది వెడ్డింగ్ కార్డ్. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ నానా రచ్చ చేసిన శ్రీ రెడ్డి.
తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసిన శ్రీ రెడ్డి వయ్యారాలు తిరిగిపోతూ, హూహూహూ అంటూ మెలికలు తిరిగింది. అసలు విషయం ఏంటని ప్రశ్నిస్తే శ్రీ రెడ్డి అసలు విషయాన్ని బయట పెట్టింది. తన చిన్న మావయ్య వాళ్ల అమ్మాయి పెళ్లికి ఈమె గారెకి ఇన్విటేషన్ ఇవ్వలేదట. ఏంటి ఈ గోల అనుకుంటున్నారా.

 

విక్టరీ వెంకటేశ్ అమ్మాయికి పెళ్లి నిశ్చయమమైంది పెళ్లి పనుల్లో భాగంగా ఆ కుటుంబం సినీ ఇండస్ట్రీలో వెడ్డింగ్ కార్డ్స్ అందిస్తున్నారు. ఆ క్రమంలో నేను డైరక్ట్ కోడలు కాకపోయినప్పటికి ఇన్ డైరెక్ట్ గా కోడలైన నాకు ఎందుకు ఇన్విటేషన్ ఇవ్వలేదని శ్రీ రెడ్డి ప్రశ్నించింది.

ఇక శ్రీ రెడ్డి వీడియోలో మాట్లాడుతూ….’వెంకటేష్ బాబు గారి పాప మ్యారేజ్ సెట్ అయ్యింది. లవ్ కమ్ ఎరేంజ్డ్ మ్యారేజ్. ఆ అమ్మాయి చేసుకోబోయే వ్యక్తి రెడ్డీస్ అబ్బాయి. కంగ్రాట్స్ వెంకటేష్ గారూ.. మీ పాప హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. మీ మీద చాలా అభిమానం ఉంది. మీరు తీసే ఫ్యామిలీ సబ్జెక్ట్స్ బహుషా ఏ హీరో తీసి ఉండరు. తొందర్లోనే మీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగడం ఆనందంగా ఉంది. నా విషెష్ మీకు నచ్చుతాయో లేదో కాని ఓ అభిమానిగా మీకు విషెష్ అందిస్తున్నా. పాజిటివ్‌గా రిసీవ్ చేసుకోవాలని కోరుతూ’ తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియో వదిలింది శ్రీరెడ్డి.

Comments

comments

Share this post

scroll to top