“ఇదే నా మరణ వాంగ్మూలం…చంపేయాలనుకుంటే చంపేయండి”.! సంచలంగా మారిన శ్రీరెడ్డి ఫేస్బుక్ పోస్ట్.!

టాలీవుడ్‌లో కామవాంఛ తీర్చితే గానీ చాన్స్ ఇవ్వరంటూ ‘క్యాస్టింగ్ కౌచ్’ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి సినీ పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసిన నటి శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఇది తన మరణ వాంగ్మూలంతో సమానమని.. ‘మా’లో మెంబర్‌షిప్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదని శ్రీరెడ్డి చెప్పింది. మానసికంగా బాగా కుంగిపోయానని, ఇప్పటికైనా సినీ పరిశ్రమలోని పెద్దలు అర్థం చేసుకోవాలని కోరుతున్నానని ఆమె పోస్ట్ చేసింది. ఇంతకన్నా చంపేయాలనుకుంటే చంపేయండని… తనకు జీవితంపై ఎలాంటి ఆసక్తి లేదని ఆవేదన వ్యక్తం చేసింది. చంపినా.. బతికినా ఇక్కడే ఉంటానని, బెదిరింపులు ఆపాలని శ్రీరెడ్డి కోరింది. దర్శకుడు తేజ ఆమెకు తన సినిమాల్లో నటించే అవకాశం కల్పిస్తానన్నా, ‘మా’లో సభ్యత్వం దక్కినా ఆమె ఇలా పోస్ట్ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీరెడ్డిని ఎవరు బెదిరిస్తున్నారనేది మిస్టరీగా మారింది.

this is eaqual to na marana vangmulam..maa lo member ship ichina ivvakapoyina parledhu..maanasikam ga baga…

Posted by Sri Reddy on Saturday, 31 March 2018

Comments

comments

Share this post

scroll to top