నా బట్టలు నేను విప్పిస్తే తప్పేంటి? – “మా” పై ఫైర్ అయిన “శ్రీరెడ్డి”.!

తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వాలని,ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పెరిగిపోతుంది అంటూ వ్యాఖ్యలు చేసి గత నెల రోజులుగా వార్తల్లో వ్యక్తిగా ఉంది శ్రీరెడ్డి..శ్రీ లీక్స్ పేరుతో రోజుకొకరి పేరుని బయటపెడుతుంది..అందులో భాగంగా నటులు,దర్శకులు,నిర్మాతల పేర్లతో పాటు చిన్న స్క్రీన్ వారు కూడా తనతో ఎలా ప్రవర్తించారో చూడండి అంటూ వైవా హర్షతో చేసిన వాట్సప్ ఛాట్ లీక్ చేసింది…నేను ఇన్ని సమస్యలు చెప్తున్నా పెద్దలు స్పందించట్లేదని నగ్నప్రదర్శన చేస్తానని చెప్పింది..చెప్పినంత పని చేసింది.
తెలుగు అమ్మాయిలకు న్యాయం జరిగే వరకు పోరాడతానని,ఈ విషయంపై సినిమ పరిశ్రమలో పెద్దలు మాట్లాడకపోతే నగ్నప్రదర్శన చేస్తానని వారం క్రితం సవాల్ విసిరింది శ్రీరెడ్డి. అన్నట్టుగానే ఫిలిం చాంబర్ ఎదుట అర్దనగ్న ప్రదర్శన చేసింది. “మా’ సభ్యత్వం కార్డు రాకుండా తనను కావాలనే పనిగట్టుకుని తొక్కేస్తున్నారని  నేను చేతగాని స్థితిలో ఉన్నప్పుడు నా నిరసనను తెలియజేస్తున్నాను. నా బట్టలు నేను విప్పేస్తే తప్పేంటి?. తెలుగు సినీ ఇండస్ట్రీ దారుణాతి దారుణ స్థితిలో ఉందని జనాలకు తెలియడానికే నా బట్టలు విప్పేయాల్సిన పరిస్థితి వచ్చింది.ఇంత జరుగుతున్నా ‘మా’ పెద్దలు స్పందింలేదు.. కనీసం ఏం జరిగింది అని అడగట్లేదు. పెద్ద హీరోలు, బడా ప్రొడ్యూసర్‌‌లు కూడా స్పందింకపోవడం బాధాకరం. ఇలా ఇంకెన్ని రోజులు మా పెద్దలు ఉంటారు?. ఇండస్ట్రీలో పెత్తందారి వ్యవస్థ నడుస్తోంది” అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.మరోవైపు శ్రీరెడ్డి నిరసనకు వ్యతిరేకంగా మా అసోషియేషన్ స్పందించింది..ఇంకెప్పటికి శ్రీరెడ్డికి సబ్యత్వం ఇవ్వము,తనతో సినిమాల్లో నటించమని తేల్చిచెప్పింది.
మరోవైపు సోషల్ మీడియాలో శ్రీరెడ్డి నిరసన పట్ల పాజిటివ్,నెగటివ్ వాదనలు వినపడుతున్నాయి.తను చేస్తున్న పోరాటం సరైందే కాని వెళుతున్న మార్గం తప్పు అని కొందరు అంటే..బట్టలు విప్పేయడం గురించి సినిమా పరిశ్రమ వారే మాట్లాడాలి.సినిమాల్లో హీరోయిన్లలను అర్దనగ్నంగా చూపించినప్పుడు పోలేదా వీరి పరువు..శ్రీరెడ్డి చేసిందాంట్లో తప్పు లేదు అంటూ తనను సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top