బాత్ టబ్ లో అలా చేయడంపై “న్యూస్ ఛానల్” ఏమని వివరణ ఇచ్చిందో తెలుసా.? కరెక్ట్ అంటారా.?

ప్ర‌ముఖ న‌టి శ్రీ‌దేవి మ‌రణించ‌డం ఏమో గానీ ఆ వార్త మాత్రం గ‌త వారం రోజుల నుంచి అటు మీడియాలో, ఇటు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ వ‌చ్చింది. అస‌లు అంత ఆరోగ్యంగా ఉన్న వ్య‌క్తి బాత్ ట‌బ్‌లో మునిగి చ‌నిపోవ‌డం ఏమిటి ? అని అంద‌రూ ఆశ్చ‌ర్యం, ఒకింత విస్మ‌యానికి కూడా లోన‌య్యారు. కానీ దీనిపై ఇప్పటికీ అస‌లు నిజం తెలియ‌లేదు. గ‌తంలో అనుమానాస్ప‌దంగా చ‌నిపోయిన ప‌లువురు న‌టీమ‌ణుల్లాగానే శ్రీ‌దేవి డెత్ మిస్ట‌రీ కూడా మిగిలిపోయింది. ఈ క్ర‌మంలోనే ఇదే విష‌యంపై అనేక చాన‌ళ్లు ప్ర‌త్యేక క‌థ‌నాల‌ను ప్రసారం చేశాయి. ప‌త్రిక‌ల్లోనూ ఈ వార్త ప్ర‌ముఖంగా వ‌చ్చింది. అయితే కొన్ని చాన‌ల్స్ మాత్రం ఈ విష‌యంలో మ‌రింత లోతుకు వెళ్లాయి. స‌గ‌టు ప్రేక్ష‌కుడికి అర్థం అవ‌డం కోసం అంటూ.. ఆయా చాన‌ల్స్‌కు చెందిన రిపోర్ట‌ర్లు స్వ‌యంగా బాత్ ట‌బ్‌ల‌లోకి దిగి ఎక్స్‌ప‌రిమెంట్లు చేశారు. శ్రీ‌దేవి ఎలా చ‌నిపోవ‌చ్చు అనే విష‌యాన్ని ప్రాక్టిక‌ల్‌గా ప‌రిశీలించేందుకు య‌త్నించారు. అయితే దీన్ని చాలా మంది జోక్‌గా తీసుకున్నారు.

న‌టి శ్రీ‌దేవి బాత్ ట‌బ్‌లో మునిగి ఎలా చ‌నిపోయి ఉంటుంది అన్న దానిపై ప‌లు మీడియా చాన‌ల్స్ చేసిన ప్ర‌త్యేక ప్రాక్టిక‌ల్ ఎక్స‌ప‌రిమెంట్లు కొంద‌రు జ‌నాల‌కు న‌చ్చ‌లేదు. దీంతో వారు ఆ చాన‌ల్స్ చేసిన ప్ర‌యోగాల‌ను సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ప్ర‌చారం చేశారు. కొంద‌రు వీటిపై జోక్స్ కూడా వేశారు. తెలుగులో టీవీ9, మ‌హా న్యూస్ చానల్స్ ఇలా బాత్ ట‌బ్‌ల‌లో ప‌డుకుని మ‌రీ శ్రీ‌దేవి ఎలా చ‌నిపోయి ఉండ‌వ‌చ్చు అనే అంశాన్ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేశాయి. అయితే ఇది చాలా మందికి హాస్యాస్ప‌దంగా అనిపించింది. దీంతో వారు ఈ చానల్స్ చేసిన ఆ కార్య‌క్ర‌మ ప్ర‌సారాల‌ను హాస్యాస్ప‌ద ధోర‌ణిలో వైర‌ల్ చేస్తూ వాటిపై జోక్స్ వేశారు. అనేక వెబ్‌సైట్ల‌లో ఈ అంశంపై విప‌రీత‌మైన ట్రోల్స్ కూడా వ‌చ్చాయి. అయితే దీనికి మ‌హా న్యూస్ చాన‌ల్ కౌంట‌ర్ వేసింది.

శ్రీ‌దేవి బాత్ ట‌బ్‌లో మునిగి ఎలా చ‌నిపోతుంది ? అది చాలా సిల్లీ విష‌యం క‌దా.. ఎవ‌రైనా ఒక‌సారి ఆలోచించండి, ఇందులో అంతా మిస్ట‌రీయే ఉంది, దాన్ని తెలియ‌జెప్పేందుకే ఈ ప్ర‌య‌త్నం చేశాం.. అస‌లు చాలా మందికి బాత్ ట‌బ్ అంటే ఎలా ఉంటుందో తెలియ‌దు, అలాంట‌ప్పుడు అందులో ప‌డి ఎలా చ‌నిపోతుంద‌ని వారికి డౌట్ వ‌స్తుంది, దాన్నే క్లియ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేశాం, అయినా అస‌లు జ‌ర్న‌లిజం ప్రామాణికాలు ఏమిటి, జ‌ర్న‌లిజం చ‌ద‌వ‌కున్నా సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని కొంద‌రు జ‌ర్న‌లిజం పాఠాలు చెప్ప‌డం దారుణం, దిక్కుమాలిన నేష‌న‌ల్ మీడియా చాన‌ల్స్ కొన్నింటికి ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌ట్ట‌వు, ఇలాంటి సిల్లీ న్యూస్‌ను పెద్దదిగా చేస్తాయి, మాకు మా ప్రేక్ష‌కులే ముఖ్యం, మీకు వ‌ద్ద‌నుకుంటే అలాంటి న్యూస్‌ను చూడ‌కండి, మీ ప‌ని మీరు చూసుకోండి, మాకు నీతులు, జ‌ర్న‌లిజం పాఠాలు చెప్పాల్సిన ప‌నిలేదు.. అంటూ మ‌హా న్యూస్ ఈ అంశంపై వివ‌ర‌ణ ఇచ్చింది. ఏది ఏమైనా నేటి త‌రుణంలో సోష‌ల్ మీడియా వ‌ల్ల మంచి విష‌యాల్లో కూడా త‌ప్పులు జ‌రుగుతున్నాయి. అది అంద‌రికీ తెలిసిందే. కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే ప‌నిగ‌ట్టుకుని ఇలాంటి విష‌యాల‌ను వైర‌ల్ చేస్తున్నారు. దీనికి చెక్ పెట్ట‌డం ఎవ‌రికీ సాధ్యం కాదు..!

watch video here:

Comments

comments

Share this post

scroll to top