“శ్రీదేవి” ప్రజలకోసం పోరాడి మరణించిన అమరజీవి కాదు.! మరి జాతీయ పతాకం కప్పడానికి కారణం ఏంటి.?

బాలీవుడ్ న‌టి శ్రీ‌దేవి.. దుబాయ్‌లో ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన మృతి చెందింది. భార‌తీయ సినీ అభిమానులంద‌రినీ శోక స‌ముద్రంలో ముంచి కాన‌రాని లోకాల‌కు వెళ్లిపోయింది. ఆమె మృతి అనంత‌రం సుదీర్ఘ విచార‌ణ త‌రువాత ఎట్ట‌కేల‌కు ఆమె మృత‌దేహాన్ని భార‌త్‌కు తెచ్చారు. దీంతో ఆమెకు అభిమానులు, సినీ న‌టులు, ప్ర‌ముఖులు చివ‌రిసారిగా క‌న్నీటితో వీడ్కోలు ప‌లికారు. ఆమె అంతిమ యాత్ర‌కు వేలాదిగా అభిమానులు త‌ర‌లివ‌చ్చారు. అయితే శ్రీ‌దేవిని త‌న‌కు ఇష్ట‌మైన కంచీవ‌రం ప‌ట్టుచీర‌తో పెళ్లి కూతురిలా అలంక‌రించారు. అది ఆమె కోరిక క‌నుక కుటుంబ స‌భ్యులు అలాగే చేశారు. కానీ ఆమెపై జాతీయ ప‌తాకం కూడా క‌ప్పారు. దీంతో ఇప్పుడీ టాపిక్ నెట్‌లో వైర‌ల్ అయింది.

సాధార‌ణంగా మ‌న దేశంలో అలా చ‌నిపోయిన వారిపై జాతీయ ప‌తాకం క‌ప్పాలంటే వారు అమ‌ర‌వీరులు అయి ఉండాలి. అంటే.. దేశం కోసం, ప్ర‌జ‌ల కోసం ప్రాణాల‌ను త్యాగం చేసిన వారు అయితేనే అలా వారి మృత‌దేహాల‌పై గౌర‌వ ప్ర‌దంగా జాతీయ ప‌తాకం క‌ప్పుతారు. కానీ శ్రీ‌దేవి కేవలం న‌టి మాత్ర‌మేన‌ని, అలాంట‌ప్పుడు ఆమె మృత‌దేహంపై జాతీయ ప‌తాకం ఎలా క‌ప్పుతార‌ని అంద‌రూ ప్ర‌శ్నిస్తున్నారు. త‌మ‌కు శ్రీదేవిపై అభిమానం ఉంద‌ని, న‌టిగా ఆమెను ఇష్ట‌ప‌డ‌తామ‌ని, కానీ ఇలా జాతీయ ప‌తాకాన్ని ఆమె మృత‌దేహంపై క‌ప్ప‌డం ఏ మాత్రం బాగాలేద‌ని, ఇలా చేయ‌డం అమ‌ర‌వీరుల‌ను కించ ప‌ర‌చ‌డ‌మే అవుతుంద‌ని కొంద‌రు వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడీ విష‌యం చ‌ర్చ‌నీయాంశం అయింది.

అయితే శ్రీ‌దేవి మృత‌దేహంపై ఆమె కుటుంబ స‌భ్యులు జాతీయ ప‌తాకం క‌ప్ప‌లేదు. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం క‌ప్పింది. ఎందుకంటే ఆమెకు చ‌ల‌న చిత్ర రంగంలో సేవ‌లు అందించినందుకు గాను 2013లో ప‌ద్మ‌శ్రీ వ‌చ్చింది. అందుకు గుర్తుగా ఆమె మృత‌దేహానికి ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య క్రియ‌ల‌ను చేయాల‌ని నిర్ణ‌యించింది. అందుకే ఆ ప్ర‌భుత్వ అధికారులు ఆమె మృత‌దేహంపై జాతీయ ప‌తాకాన్ని క‌ప్పారు. కానీ దీన్ని కొంద‌రు త‌ప్పుగా అనుకోవ‌డంతో ఇప్పుడీ వార్త సెన్సేష‌న్ అవుతోంది. ఏది ఏమైనా.. ఇలాంటి న‌టిని మాత్రం మ‌న ఇంక చూడ‌బోము అన్న విష‌యంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top