మహేష్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి!!

నిన్నటి వరకు చెన్నైలో ఉండి అక్కడి సినిమా అవకాశాలు చేజిక్కించుకున్న శ్రీ రెడ్డి తాజాగా హైదరాబాద్ చేరుకుంది. ఏపీలో ఎన్నికల వేడి మొదలైన నేపధ్యంలో శ్రీ రెడ్డి మళ్లీ తన ఫేస్ బుక్ కు పని చెప్పింది. ఏపీ రాజకీయాలపై స్పందిస్తూ వీడియోలు చేస్తున్న శ్రీ రెడ్డి తనకు నచ్చిన వారిని ప్రశంసిస్తూ, నచ్చని వారిని విమర్శించడం ప్రారంభించింది. తాజాగా శ్రీ రెడ్డి సూపర్ స్టార్ మహేశ్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


మహేష్ బాబు ఫోటో షేర్ చేసిన శ్రీ రెడ్డి…. ఆయన సినిమాల్లో చాలా మంది స్ఫూర్తిదాయకమైన కథలను ఎంచుకుంటారు. ఎంత మంది ఆయన్ను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తారు? ఆయనకు సూట్ అయ్యే పార్టీ ఏది? నేను ఆయన ఎంచుకునే సబ్జెక్టులకు, సింప్లిసిటీ కి అభిమానిని” అని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.
శ్రీ రెడ్డి పోస్ట్ పై మహేశ్ బాబు అభిమానులు వెంటనే స్పందించారు. కొందరు ఆయన వైసీపీలో చేరితే బాగుంటుందంటే మరికొందరు టీడీపీ సూట్ అవుతుందని రిప్లై ఇచ్చారు. మరికొందరైతే ఆయన్ని రాజకీయాల్లోకి లాగొద్దంటూ వేడుకున్నారు.
ఇటీవల మహేష్ కు చాలా ఇంటర్వ్యూల్లో రాజకీయాలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి మహేష్ రెస్పాండ్ అవుతూ తాను రాజకీయాలకు దూరమని, తనకు వాటి గురించి తెలీదని ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేసారు.

 

Comments

comments

Share this post

scroll to top