స్టేషన్‌‌కు శ్రీరెడ్డితో వెళ్లి.. చెప్పుతో కొట్టింది!

గత కొంతకాలంగా టాలివుడ్లోని కాస్టింగ్ కౌచ్ వ్యవహారం దుమ్మురేపుతుంది..శ్రీరెడ్డి తరువాత ఒక్కోక్కరూ ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పుతున్నారు.తెలుగు పరిశ్రమతో పాటు ఇతర పరిశ్రమల హీరోయిన్లు కూడా కాస్టింగ్ కౌచ్ పై స్పందించడం విశేషం..తాజాగా తనకు అవకాశాలప్పిస్తానని ఒక కోఆర్డినేటర్ మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్టు రోజా బంజారహిల్స్ పోలీసులను సంప్రదించింది..ఆర్టిస్టు రోజాకు మద్దతు తెలుపుతూ శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకుంది..అక్కడ అనూహ్యంగా కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి..

శ్రీశాంత్ రెడ్డి అనే కో ఆర్డినేటర్ తన రూం కి వచ్చి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపిచ్చి అత్యాచారం చేశాడు..అంతేకాదు తన దగ్గరున్న నలభై తులాలు బంగారం,5లక్షలు ఎత్తుకెళ్లిపోయాడని ఈ మధ్య తన ఫేస్బుక్ ఫేజ్ లో పోస్టు చేసింది రోజా అనే జూనియర్ ఆర్టిస్టు..అంతేకాదు ఇదే విషయాన్ని వాట్సప్ గ్రూపుల్లోనూ పోస్టు చేసింది..పోలీసులకు కంప్లైంట్ చేస్తానని తన మెసేజ్లో పేర్కొంద..ఈ విషయం తెలిసిన నిందితుడు తన పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియలో ప్రచారం చేస్తున్నారని రోజాపై కంప్లైంట్ చేశాడు శ్రీశాంత్ రెడ్డి అలియాస్ పుల్లారెడ్డి..

కృష్ణానగర్‌కు చెందిన శ్రీశాంత్ రెడ్డి అలియాస్ పుల్లా రెడ్డి  టీవీలు, సినిమాలకు ఆర్టిస్ట్‌లను సమకూర్చుతుంటాడు. ఈ క్రమంలోనే రోజాకి,శ్రీశాంత్ కి పరిచయం ఏర్పడింది.అవకాశాలిప్పిస్తానని తనను మోసం చేశాడని,పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాదితురాలు రోజా ఫిర్యాదు చేయడానికి బంజారహిల్స్ పిఎస్ కి వెళ్లింది.అక్కడ అదే టైంకి అక్కడున్న శ్రీశాంత్ ని చూసి ఆగ్రహంతో అతడిపైకి దాడికి దిగింది..తనతోపాటు వచ్చిన మిగతా మహిళలు శ్రీశాంత్ పై చేయి చేసుకున్నారు..ఆగ్రహంతో ఎస్ఐ టేబుల్ పైకి ఎక్కి మరీ శ్రీశాంత్ ని చెప్పుతో కొట్టడం విశేషం.రోజాకి మద్దతుగా శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్ కి వచ్చింది..అతడిపై దాడి జరుగుతున్న టైంలో శ్రీరెడ్డి అక్కడే ఉంది.

Comments

comments

Share this post

scroll to top