రోజాని కామెంట్ చేసిన శ్రీరెడ్డి…మహేశ్ గురించి నెగటివ్ కామెంట్స్..!

తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి గత కొంత కాలంగా మౌనంగా ఉన్న విషయం తెలిసిందే..పవన్ కళ్యాణ్ ని అసభ్యంగా దూషించిన శ్రీరెడ్డి పట్ల సర్వత్రా వ్యతిరేఖత రావడంతో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం పక్కదోవ పట్టింది,దాంతో సైలెంట్ అయిన శ్రీరెడ్డి మళ్లీ తెరపైకి వచ్చింది.ఈ సారి వైసీపి నేత ,నటి రోజా పై కామెంట్స్ చేసింది.అంతేకాదు మహేశ్ గురించి ,భరత్ అనే నేను సినిమా గురించి కూడా నెగటివ్ కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి..

గత కొంత కాలంగా మీడియాలో జరుగుతున్న వ్యవహారాలు తాను గమనిస్తూనే ఉన్నానని రోజా ఇటీవల ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. కొన్ని రోజులు అయ్యాక సైలెంట్ అవుతారని భావించా. కానీ పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించే విధంగా ప్రోత్సాహించడాన్ని తట్టుకోలేకపోయానని ,ఇండస్ట్రీ మీద కావాలనే బురద చాల్లే ఘటనలు జరుగుతున్నాయి. తాను ఇండస్ట్రీకి వచ్చి 27 ఏళ్ళు గడిచిందని రోజా అన్నారు..కాస్టింగ్ కౌచ్ ఉండుంటే ఇన్నేళ్లు ఎలా ఉంటామని ప్రశ్నించిన రోజాకి గట్టిగా కౌంటర్ ఇచ్చింది శ్రీరెడ్డి…

రోజా గారి కవరింగ్ బాగానే ఉంది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదా.. వాయమ్మా అంటూ కామెంట్ చేసింది శ్రీరెడ్డి.ఇండస్ట్రీకి వచ్చి ఇరవైఏడేళ్లయినా నిన్నెవరూ కెలకలేదా..అంటే నువ్వెవరికి నచ్చలేదేమో..నేను ఇండస్ట్రీ మీద బురద చల్లానా అంటూ ఇండస్ట్రీ రిపోర్ట్ మొత్తం రెడీ  అవుతుందని సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది.నాతో వద్దమ్మా నీ లొల్లి అంటూ నాగ్ బేబీ అని చివర్లో సంభోదించింది…

మరోవైపు తన ఎఫ్బీ పేజ్ లో   మహేష్ భరత్ అనే నేను చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇప్పుడే భరత్ అనే నేను మూవీ చూసాను. అసలు ఇది బ్లాక్ బస్టర్ మూవీ ఎంటిరా.. బిలో యావరేజ్‌ మూవీ. మహేష్ బాబు క్రేజ్‌ వల్ల హిట్ టాక్ వచ్చింది. లేకపోతే పక్కా ఫ్లాప్. వరెస్ట్‌ డైరెక్షన్‌, కంటెంట్ లేని కథ, ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్‌ లేని యాక్టర్‌గా మహేష్ బాబుని తయారుచేస్తున్నారు………….

ఇదీ శ్రీరెడ్డి పోస్టు సారాంశం.భరత్ అనే నేను చిత్రం అసలు బాగాలేదని  పెట్టిన పోస్టుని కాసేపటికి  డిలీట్ చేసింది.  అంతేకాదు ఏవిధంగానైతే పవన్ విషయంలో యూటర్న్ తీసుకుందో ఈ విషయంలోనూ మాట మార్చింది.సమాజానికి మంచి సందేశాలు ఇచ్చే చిత్రాలు చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న మహేష్ బాబు గ్రేట్ పర్సన్ అని ప్రశంసలతో ముంచెత్తింది.

 

Comments

comments

Share this post

scroll to top