ఊరుమ్మడి ఉత్సవం ..సీతారాముల కళ్యాణం

తెలుగు వారి లోగిళ్లన్నీ ఇప్పుడు కళ్యాణ కాంతులతో కళకళ లాడుతున్నాయి . అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణోత్సవాలకు సిద్ధమవుతున్నాయి . పల్లెలు ..పట్టణాలు అన్నీ ముస్తాబవుతున్నాయి. ప్రతి ఇంటా రామాయణం ..పారాయణం నిత్యం జరుగుతోంది . ఊళ్లన్నీ ఇప్పుడు ఒకే స్వరాన్ని వినిపిస్తున్నాయి . పిల్లలు ..పెద్దలు ..మహిళలు ..ఊరి జనం మూకుమ్మడిగా ఒకే చోటకు చేరుకొని చేసే ఊరుమ్మడి వసుధైక పండుగ రాములోరి కళ్యాణం . ప్రతి ఇంట్లో శ్రీరాముడిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది . రాముడికి హనుమంతుడి తోడు ఉండటం ..ఆ అద్భుత గాధను ప్రజలకు తెలియ చెప్పడం . దేవాలయాలను సుందరంగా తీర్చి దిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములవుతారు . ప్రతి ఊరులో గుడి ఉంటుంది . అందులో తప్పక ఆంజనేయ స్వామి ఆలయం ఉండాల్సిందే . ఊరంతా పోగవుతారు కళ్యాణం జెరిగే కంటే ముందే భారీ ఎత్తున సీతను ..రాముడిని జనం ఊరి పెద్దల సహాయంతో అలంకరించడం చేస్తారు .

ప్రభుత్వం లాంఛనంగా పట్టు వస్తారాలను .తలంబ్రాలను ..తాంబూలాలు ..మంగళ సూత్రాలను భద్రాచలం లోని ఆ భద్రాద్రిలో కొలువై వున్న స్వామి అమ్మవార్లకు బహుకరిస్తారు . తరాల నుంచి ఇలా అందచేయడం వస్తూనే ఉన్నది. ఈ దేశంలో గణపతి ఉత్సవాలతో పాటు సీతారాముల కల్యాణాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి . ఊరి జనం ఎక్కువగా పాల్గొనేది ఈ రెండు పండుగల్లోనే . అన్నీ మరిచి పోతారు . అన్నిటి వదిలేస్తారు . కుల మతాలను పక్కన పెడతారు . ప్రతి ఇంట్లో పండుగ వాతావరం నెలకొంటుంది . ఊరంతా జనం చందాలు పోగేసుకుని ..కళ్యాణం జరిపిస్తారు . శ్రీరాముడు నీతికి .నిజాయితీకి ..ధర్మానికి ప్రతి రూపం . సీతమ్మ చక్కదనం కలిగిన ఆదర్శ మూర్తి . ఎవ్వరైనా ఊర్లో కానీ ..ఇంట్లో కానీ పెద్దవాళ్ళు ప్రతి అంశంలో ..ప్రతి విషయంలో రాముడిని .సీతను ఉదహరించడం మామూలే .

ఊరంతా సీత రాముల కళ్యాణం గొప్పగా చేస్తారు . అందరు కలిసి భోజనాలు ..ప్రసాదాలు అందజేస్తారు . పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది . దేశంలోని ప్రతి ఊరు రామ నామంతో దద్దరిల్లి పోతుంది . ఆకాశమంత పందిరి . భూదేవి అంత అలంకరణతో చేయడం సహజం . శ్రీరామ నవమి పండుగ సందర్బంగా సీతకు రాముడికి పెళ్లి జరిపిండం ..ఊరంతా పెద్దలుగా ఉండటం ..వడ పళ్ళు ..పానకం ..తీర్థ ప్రసాదాలు అందజేస్తారు . ఇదో ఊరుమ్మడి ఉత్సవం . అన్ని మతాలు .కులాల వారిని ఒక్కటిగా చేసే పండుగ ఇదొక్కటే . సీతను సహనానికి ..రాముడు కార్యసాధకుడిగా చెబుతారు . ఎన్ని కస్టాలు వచ్చినా తాను అనుకున్నది సాధించిన రాముడిని స్ఫూర్తిగా తీసుకోవాలని పెద్దలు చెబుతారు .

రాముడు అభిజిత్ ముహూర్తంలో పుట్టాడని చెబుతారు . పద్నాలుగు ఏళ్ళు అరణ్య వాసం చేసి ..రావణాసురుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చి ..సీతను పెళ్లి చేసుకోవడం తోనే ఈ పండుగ ప్రారంభమైంది . ఇదే రోజు పట్టాభిషేకం జరగడం . సీతను పెండ్లి చేసు కోవడంతో దీనినే పండుగలా దేశమంతటా చేయడం పరిపాటిగా మారింది . ఈ రోజే కళ్యాణం జరిపించేందుకు ప్రధాన కారణం కంచర్ల గోపన్న . చలువ పందిళ్లు ..యువతీ యువకుల సమ్మేళనం .పెద్దల అనుబంధం ఇక్కడ కనిపిస్తోంది . ఉగాది తర్వాత వచ్చే అతిపెద్ద పండుగగా శ్రీరామనవమిని జరుపుతారు . ఊళ్లన్నీ తోరణాలతో ..లోగిళ్లన్నీ పూలతో ..దేవాలయాలు ముస్తాబు కావడం తో దేశం కల్యాణ శోభతో కాంతులీనుతోంది .

Comments

comments

Share this post

scroll to top