వాట్సాప్‌లో నా కాళ్లు పంపిస్తా.. అప్పుడు పట్టుకో.. శ్రీముఖిపై సుమ ఝలక్..!

ఈ మధ్య టివి ఛానెల్లలో రకరకాల ప్రోగ్రాం లు వస్తున్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అనేక రకాల అంశాలు..వాటిల్లో ఒకటే ప్రాంక్ కాల్..ఎవరికైనా కాల్ చేసి అవతలి వారికి మనం ఎవరమో తెలియకుండా మాట్లాడుతూ ఆటపట్టించాలి..కాని కాల్ చేసిన వారినే అవతల వారు ఆటపట్టిస్తే అప్పుడు ఉంటుంది అసలు మజా..అలా ఈ మద్య రష్మి యాంకర్ గా ఉన్న   ఒక ప్రోగ్రామ్ కి శ్రీముఖి గెస్ట్ గా వచ్చింది,ప్రాంక్ కాల్ చేయాల్సి వచ్చింది..దాంతో సుమకు కాల్ చేస్తానని చెప్పింది.సుమకే ఝలక్ ఇవ్వాలనుకున్న శ్రీముఖికి తన పంచ్ లతో జలక్ ఇచ్చింది సుమ..సుమ గురించి కొత్తగా చెప్పాలా పంచ్ పుట్టిందే సుమ తర్వాత..వారిద్దరి మధ్యజరిగిన ప్రాంక్ కాల్ సంభాషణ మీరే చదవండి..

సుమకు శ్రీముఖి కాల్ చేసి.. గుంటూరు నుంచి నేను పుష్ఫను కాల్ చేస్తున్నాను. చాలా కష్టపడితే నీ ఫోన్ నంబర్ దొరికిందమ్మా. నీతో ఫోన్‌లో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది అని శ్రీముఖి గొంతు మార్చి చెప్పింది.నీతో మాట్లాడినందుకు  ఈ రోజు అన్నం తినను అని శ్రీముఖి అనగా.. మూడు రోజులు పాటు తినకు  చాలా మందికి భోజనం మిగులుతుంది అని సుమ బదులిచ్చింది. దాంతో టివిలో  మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు సుమమ్మా అని శ్రీముఖి అనగానే.. లేదమ్మా నేను ఫోన్‌లో మాట్లాడుతున్నాను అని సుమ పంచ్ ఇచ్చింది.

నాకు స్టార్ మహిళ కార్యక్రమంలో పాల్గొనాలని చిన్నప్పటి నుంచి కోరిక ఉంది. కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటాను. ఏదో ఒకరోజు స్టార్ మహిళకు పోతా. అక్కను కలుస్తానని నా మొగుడికి చెప్పాను అని శ్రీముఖి చెప్పింది.సుమమ్మా నీవు ఊ అంటే ఒక్కసారి స్టార్ మహిళలకు వచ్చిపోతాను అని ఫోన్‌లో వెంటపడింది. నీ బిజీగా ఉన్నాను అని సుమ చెబుతుండగా.. కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటా అని శ్రీముఖి చెప్పగా.. కావాలంటే నా కాళ్లు వాట్సప్‌లో పంపిస్తా.. అప్పుడు నా కాళ్లను పట్టుకో అని సుమ పంచ్ విసిరింది…

చివరికి ఈ కాల్ లోకి రష్మి ఎంటరవడం,రష్మి గొంతు సుమ గుర్తు పట్టడంతో అది ప్రాంక్ కాల్ అని చెప్పడంతో ఈ ప్రాంక్ కాల్ కథ ముగిసింది.నిజంగా సుమతో మాట్లాడంటే చాలా కష్టం..స్పాంటేనియస్ గా పంచ్లు వేయడంలో సుమ తర్వాతే ఎవరైనా ..అందుకే ఇంతకాలం అయినా టెలివిజన్ రారాణిగా ఏలుతుంది..

Comments

comments

Share this post

scroll to top