“అర్జున్ రెడ్డి” మహిళలను కించపరిచేలా ఉందన్నారు..మరిప్పుడు “శ్రీముఖి” చేసిందేంటి.? [VIDEO]

అర్జున్ రెడ్డి రిలీజ్ కు ముందే ఎన్నో విమర్శలు ఎదుర్కొంది..దర్శకుడు,హీరో,హీరోయిన్ మొత్తం సినిమా టీం ధైర్యాన్ని మెచ్చుకోవాలి.ఇలాంటి సినిమా విడుదలకు  ముందు  ,విడుదల తర్వాత కూడా ఎన్నో వివాదాలు ఎదుర్కొని సూపర్ హిట్ సినిమాగా నిలిచింది..బయట జరుగుతున్నదే చూపించారు అని సినిమాని పొగిడిన వాళ్లుంటే,ఈ సినిమా చూసి చాలామంది అబ్బాయిలు అర్జున్ రెడ్డిలు అవుతారు అని తిట్టినవాళ్లున్నారు.అప్పుడు అర్జున్ రెడ్డి ని తిట్టిన వాళ్లంతా ,ఇప్పుడు శ్రీముఖిని కళ్లప్పగించి చూస్తున్నారు..ఎక్కడో కాదు మన నట్టింట్లో మన టివిలో…మన కుటుంబం మధ్య కూర్చుని,కళ్లింతలు చేస్కుని,నోరు తెరుచుకుని  చూస్తున్నారు..అప్పుడు అర్జున్ రెడ్డి విషయంలో వచ్చిన కామెంట్స్ ఇప్పుడు ఈ ప్రోగ్రాం గురించి ఎందుకు రావట్లేదు..

watch video here:

ఎవడ్రా వాడు మాదర్ చోద్ డైలాగ్ సినిమాలో వినపడినప్పడు,అదే కాదు ప్రతి డైలాగ్  ని,ప్రతి సీన్  ని విమర్శించారు.ఇప్పుడు అదే డైలాగ్,అదే సైన్ తో శ్రీముఖి ఈ మధ్య ఒక ప్రోగ్రాంలో యాక్ట్ చేసింది.ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన వారితో కూడా డబుల్ మీనింగ్ డైలాగ్సే మాట్లాడింది.అప్పుడు సినిమా పట్ల వచ్చిన విమర్శలు,ఇప్పుడు ఈ ప్రోగ్రాం పట్ల రావాలి కదా..అర్రె ఇది కామెడి రా బై అని కొట్టి పారేస్తారా.. అలా చాలానే కొట్టిపారేశారు..మన నట్టింట్లో ఎన్నో ఛానళ్లు ఎన్నో ప్రోగ్రాంలో అర్జున్ రెడ్డి సినిమాకి మించిన బూతులు వస్తున్నాయి.వాటిని మనం చూస్తున్నాం.మనకెందుకులే అని వదిలేస్తున్నాం..అర్జున్ రెడ్డి పై ఫైర్ అయిన వారంతా ఒకసారి శ్రీముఖి ప్రోగ్రాం వీడియో చూసి తరించండి..

Comments

comments

Share this post

scroll to top