బాబోయ్..శ్రీముఖి ఈ రేంజ్ లో సమాధానం ఇచ్చింది ఏంటి..? దెబ్బకు ఆలీ కి దిమ్మతిరిగింది..!

యాంకర్ కి ఉండాల్సిన ముఖ్య లక్షణం..స్పాంటెనిటి..సంధర్బానికి తగ్గట్టు మాట్లాడుతు ఎదుటి వాళ్లను ఆకట్టుకోగలగాలి. ఇంత వరకూ ఇలాంటి క్వాలిటీ ఎక్కువగా సుమలోనే ఉండేది..ఇప్పుడు సుమ తర్వాత ఆ ప్లేస్ శ్రీ ముఖి సొంతం చేసుకుంది.ఇప్పటికే చాలా ప్రొగ్రామ్స్ యాంకరింగ్ చేస్తూ,మరో వైపు సినిమా ప్రమోషన్స్ చేస్తుంది.కొన్ని ప్రొగ్రామ్స్ సింగిల్ గా మరికొన్ని ప్రొగ్రామ్స్ యాంకర్ రవితో కలిసి చేస్తుంది..వీరిద్దరూ ఇటీవల ఆలీతో సరదాగా అనే ప్రొగ్రాంకి అటెండ్ అయ్యారు.అక్కడ ఆలి కి చుక్కలు చూపించారు వీళ్ల సమాధానాలతో..ఇంకోసారి ఎవరూ అలాంటి క్వశ్చన్స్ అడగగకుండా చేసారు..అంతేకాదు..శ్రీముఖి గురించి చాలా విషయాలు కూడా తెలిశాయి అవేంటో తెలుసా..

బలపాలు తినడం చిన్నప్పుడు చాలామందికే అలవాటుంటుంది.కానీ బలపం దొరక్కపోతే గోడకున్న సున్నం కూడా గీక్కుని తినేదట శ్రీముఖి..ఈ విషయాన్ని వాళ్లమ్మే ఆ ప్రొగ్రామ్ లో స్వయంగా చెప్పింది..ఇప్పుడు లావుగా ఉన్న శ్రీముఖిని చూసి ఈ అమ్మాయేంటి ఇంత లావు అవుతుంది అనుకుంటే పొరపాటే..శ్రీముఖి ముందు నుండి లావేనట..మధ్యలో సినిమా అవకాశాల కోసం బరువు తగ్గడం..మళ్లీ ఇప్పుడు పెళ్లి కోసం లావు తగ్గింది.పెళ్లి ఎవరితో అనేది మాత్రం చెప్పలేదు.శ్రీముఖి ,రవిల మధ్య రిలేషన్ గురించి ఆలి అడిగిన క్వశ్చన్స్ కి వాళ్లు ఇస్తున్న ఆన్సర్స్ కి నిజంగా నిజాలేనా..లేకపోతే ఆలిని ఆటపట్టిస్తున్నారా అనిపించేలా ఉన్నాయి..నాకైతే ఆలికి తిక్క కుదిరింది ..ఇలాగే ఆన్సర్ ఇవ్వాలి అనిపించింది..ఎందుకంటే ఏది పడితే అది,ఎలా పడితే అలా వాగడం ఆలికి అలవాటు,దాంతో పాటు తిట్లు తినడం కూడా.. కానీ శ్రీముఖి ,రవిలు ఆలికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు.ఏ క్వశ్చన్ అడిగినా టకటక సమాధానం చెప్పి ఆడుకున్నారు ..

.రవి,లాస్య జంట యాంకరింగ్ బాగుండేది.ఇప్పుడు రవి శ్రీముఖి జంట కూడా బాగా క్లిక్ అయింది..ఇంతకీ ఆలి అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే మీరు రవి డేటింగ్ లో ఉన్నారా..మీకు రవి అంటే ఇష్టమా..ఇలాంటి క్వశ్చన్స్ దానికి శ్రీముఖి ఇచ్చిన ఆన్సర్స్ ఏంటంటే హా రవి అంటే నాకు ఇష్టం కాదు పిచ్చి..అవును డేటింగ్ లో ఉన్నాం అంటూ సమాధానం ఇచ్చింది..అంతేకాదు వాళ్ల రిలేషన్ గురించి మరిన్ని విషయాలు చెప్పింది..

watch video here:

Comments

comments

Share this post

scroll to top