ఏమంటివి ఏమంటివీ , జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువ? హ.., ఎంతమాట ఎంతమాట
ఇది క్షాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్షా కాదే , కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఏ యందువ , నీ తండ్రి భరద్వాజుని జననమేట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవమేట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా హహహ నిది ఎ కులమూ? అంటూ గుక్క తిప్పుకోకుండా సీనియర్ NTR చెప్పిన డైలాగ్..ఎంత పాపులర్ లో అందరికీ తెల్సిందే… ఇప్పుడు అదే డైలాగ్ ను సాప్ట్ వేర్ రంగానికి అన్వయిస్తూ…. సోషల్ మీడియాలో ఓ పేరడీ డైలాగ్ వైరల్ అవుతుంది. జాబ్ సెక్యురిటీ లేని సాప్ట్ వేర్ రంగంపై స్టెయిట్ సెటైర్ వేసిన ఆ పేరడి ఇదిగో మీకోసం……..
ఏమంటివి!!…
ఏమంటివి!!…
బగ్గు నెపమున ఈ మృదుపరికరణ నిపుణుని (software professional) కి ఇందు పని చేయుటకు అర్హత లేదందువా?
ఎంత మాటా!!…
ఎంత మాటా!!…
ఇది యూనిట్ టెస్టింగే (Unit Testing) ఏ కానీ యూజరాక్సెప్టన్స్ (Useracceptance Testing) కాదే..!!
కాదూ కాకూడదూ,
ఇందు బగ్స్ రాకూడదూ అందువా….??
అయిన ఈ ప్రాజెక్ట్ లీడ్ కోడింగ్ ఎట్టిది?
అతి జుగుప్సాకరమైన
నీ కోడింగ్ ఎట్టిది?
గూగుల్ లో కాపీ కొట్టితివి కదా హా..హా..హా
నీది ఏమి కోడింగు??
అంత ఏల మన కంపెనీ పితామహుడు , సాఫ్ట్ వేర్ లో కురువృధ్ధుడు అయిన మన సిఈఓ(CEO) బగ్గు ఫిక్సు చెయ్యలేక పాత కంపెనీ నుండి పారిపోయి రాలేదా?? ఆయనదే కోడింగు..??
నాతో చెప్పింతువేమయ్యా..!!
ఈ కోడింగు మొదలుపెట్టిన నువ్వు…
వర్షన్ 1.1 ని…
దాన్ని రివ్యూ చేసిన నీ టియల్ (TL) వర్షన్ 1.2 ని….
అందులో బగ్గు ఫిక్స్ చేసిన నీ పియల్(PL) వర్షన్ 1.3 ని…. తయారు చెయ్యలేదా…??
సందర్భావసరాల బట్టి .. కాస్టు కటింగు (Cost Cutting) ప్రాధాన్యంతో.. తయారయిన మన కోడ్ ఏనాడో బగ్సుపరమైనది.
కాగా నేడు బగ్గు.. బగ్గు.. అని ఈ వ్యర్ధవాదనెందులకు?