భారీ అంచనాల నడుమ విడుదలైన “స్పైడర్” తో “మహేష్” హిట్ కొట్టారా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్(తెలుగులో)

Krishna

Movie Title (చిత్రం): స్పైడర్ (Spyder)

Cast & Crew:

 • నటీనటులు: మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, ప్రియదర్శి తదితరులు..
 • సంగీతం: హారిస్ జయరాజ్
 • సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్
 • నిర్మాణం: ఎన్వీ ఆర్ సినిమా ఎల్ఎల్పీ
 • నిర్మాత: ఠాగూర్ మథ, ప్రసాద్ ఎన్వీ
 • దర్శకత్వం: ఎ.ఆర్.మురుగదాస్

Story:

స్పైడర్‌ జేమ్స్‌బాండ్‌ తరహాలో పూర్తిస్థాయి ఫ్యూచెరిస్టిక్‌ మూవీ కాదు. స్పై మూవీ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ మన దేశంలో ఎలా పనిచేస్తుంది. వారు దేశంలో మన కోసం ఏం చేస్తున్నారు అనేవి సినిమాలో చూపించారు. సినిమాలో ఎమోషన్స్‌ కూడా ఉన్నాయి. మురుగదాస్ సినిమాల్లో డైరెక్ట్‌ మెసేజ్‌ లేక ఇన్‌డైరెక్ట్‌ మెసేజ్‌లుంటాయి. స్పైడర్‌లో కూడా హ్యుమానిటీకి సంబంధించిన మెసేజ్‌తో ఉంటుంది. మనిషిలో హ్యుమానిటీ తగ్గిపోయినప్పుడు సోసైటీలో లంచం పెరిగిపోతుంది లేదా మరేదైనా వైపరీత్యం సంభవిస్తుంది..ఈ మెసేజ్‌ను ఇన్‌డైరెక్ట్‌గా ప్రేక్షకులకు చూపించారు.

Review:

మహేష్ బాబు ఈ మూవీ లో సరికొత్తగా కనిపించడమే కాదు తన నటనలో కొత్తదనం కనిపించింది. ఫైట్స్ , యాక్టింగ్ , డాన్స్ ఇలా అన్నిటిలో మహేష్ తన లెవల్ పెంచుకున్నాడు. రకుల్ ప్రీతి సింగ్ గ్లామర్ తో పాటు తన నటన కూడా బాగుంది..ప్రతి నాయకుడి పాత్రలో ఎస్ జె సూర్య నటన అదిరిపోయింది. ఇండస్ట్రీ కి సరికొత్త విలన్ దొరికాడు అని చెప్పవచ్చు. అలాగే మరో నటుడు భరత్ కూడా విలన్ రోల్ లో బాగా నటించాడు. ఇక హేరిస్‌ జయరాజ్‌ మ్యూజిక్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం లో విఫలం అయ్యింది. రెండు సాంగ్స్ తప్ప పెద్దగా జనాలకు ఎక్కలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సంతోష్‌ శివన్‌ సినిమా ఫోటోగ్రాఫి సినిమా కు హైలైట్ గా నిలవనుంది. ముఖ్యం గా క్లైమాక్స్ లో ఈయన కెమెరాపనితనం అదరహో అనిపిస్తుంది. పీటర్‌ హెయిన్‌ ఫైట్స్ యాక్షన్ ప్రియులకు బాగా నచ్చుతాయి. ఇక నిర్మాణ విలువల విషయానికి వస్తే ఠాగూర్‌ మధు, ఎన్‌.వి.ప్రసాద్‌ లు భారీ ఖర్చు తో సినిమా ను తెలుగు , తమిళ్ భాషల్లో ఎంతో చక్కగా తెరకెక్కించారు. ఓవరాల్ గా మహేష్ అభిమానులకు స్పైడర్ సరికొత్త గా అనిపిస్తుంది..

Plus Points:

 • మహేష్ బాబు పర్ఫార్మెన్స్
 • స్టోరీ, డైరెక్షన్
 • క్లైమ్యాక్స్ మెసేజ్
 • బ్యాక్ గ్రౌండ్ మ్యూసిక్
 • సినిమ్యాటోగ్రఫీ

Minus Points:

 • తమిళ్ నేటివిటీ ఎక్కువ ఉండడం
 • సాంగ్స్ అంతగా బాలేదు
 • సెకెండ్ హాఫ్

Final Verdict:

క్లాస్ మరియు మాస్ ఆడియెన్స్ కి నచ్చేలా ఉంది “స్పైడర్”

AP2TG Rating: 3.75 / 5

Trailer:

Comments

comments