స్పైడర్ సినిమా చూసి మొదటి రివ్యూ ఇచ్చిన సెన్సార్ బోర్డు మెంబర్ “ఉమర్ సంధు”..ఏమన్నారో తెలుసా.?

Krishna

ఉమ‌ర్ సంధూ సినిమా విడుద‌ల ముందే రివ్యూ అండ్ రేటింగ్ ఇస్తాడు. తాజాగా ఉమ‌ర్ సంధూ మ‌హేష్ బాబు తాజా చిత్రం స్పైడ‌ర్ పై త‌న రివ్యూను తెలిపాడు. ఈ చిత్రం అద్భుతంగా ఉందని ప్రశంసించిన ఆయన, ఇది చక్కగా తయారు చేసిన థ్రిల్లర్ చిత్రమని అన్నారు. 3.5 రేటింగ్ ఇచ్చిన ఉమైర్ సంధూ, కనిపించకుండా ఘోరాలు చేసే విలన్ ను కనిపెట్టి, ఆట కట్టించే పాత్రలో మహేష్ నటన అద్భుతమని అన్నారు.

విలన్ ఎవరో కనిపెట్టేందుకు వేసే ఎత్తులు, పై ఎత్తులు అలరిస్తాయని చెప్పారు. చిత్రంలో క్లైమాక్స్ అత్యుత్తమమని, ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేస్తుందని చెప్పారు. అటు క్లాస్ ను, ఇటు మాస్ ను అలరించే విధంగా తయారైన ‘స్పైడర్’, ఈ దసరాకు బ్లాక్ బస్టరేనని తేల్చారు. విలన్ గా సూర్య, హీరోయిన్ రకుల్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని చెప్పుకొచ్చారు. కాగా, ఇటీవల విడుదలైన ‘జై లవకుశ’ ఫస్ట్ రివ్యూలో కూడా ఉమైర్ సంధూ 3.5 రేటింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Comments

comments