ద్రావిడ్, రెండు గాజులు రాకుండా మొదలయ్యే మొదటి సినిమా “స్పైడర్”..కారణం ఏంటో తెలుసా.?

మనమేదో రిలాక్స్ అవ్వడానికి, ఎంటర్టైన్ అవ్వడానికి సినిమాకి వెళ్తాము. వెళ్ళగానే పది నిముషాలు మన రాహుల్ ద్రావిడ్ గారు స్లిప్ ఫీల్డింగ్ లో క్యాచ్ మిస్ గురించి, రన్ అవుట్ అవ్వడం గురించి రెండు సార్లు చెప్తారు. అంతటితో ఆగదు..మన రేఖ సోదరుడు రెండు గాజులు అమ్ముకోడం గురించి కూడా వస్తుంది. పైగా రెండు మూడు సార్లు రిపీట్ అవుతుంది. ఇంతకముందు ఆరోగ్యాన్ని, ఆనందమైన కుటుంబాన్ని ఎవరు కోరుకోరు అని వచ్చేది. అది బుర్ర తినడం ఏంటో కానీ. ఈ సోది చెప్పి నేను బుర్ర తింటున్నట్టు ఉన్న. ఇప్పుడు అసలు మేటర్ ఏంటంటే ఈ సోది లేకుండా మనముందు ఓ సినిమా రానుంది.

మహేష్, రకుల్ జంటగా మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న “స్పైడర్” సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ఒక్క స్మోకింగ్, డ్రింకింగ్ సీన్ లేకపోవడంతో స్టార్టింగ్ యాడ్ అంత రాదని సినీ వర్గాలు వెల్లడించాయి. మరి అది నిజమో కాదో సినిమా చూసి ఫిక్స్ అవ్వాలి.ఏదేమైనా ఆ యాడ్ రాదు అని వింటే కొంచెం సంతోషంగా అనిపిస్తుంది.

Comments

comments

Share this post

scroll to top