తమిళ్ “స్పైడర్” ట్రైలర్ తెలుగు కంటే “1 సెకండ్” ఎక్కువ ఉంది.! ఆ సెకెన్లో ఏం చూపించారో చూడండి!

ప్రిన్స్ మహేష్‌బాబు స్పైడర్‌ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ఆడియన్స్‌ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్‌బాబు, మురుగదాస్‌ కలయికలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇక అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండబోతుందని ఇటీవలే విడుదలైన  హాలీవుడ్ రేంజ్ లో ఉన్న టీజర్ చెప్పనకే చెప్పింది. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్‌ సినిమా స్థాయి ఏంటో మరో సారి చూపించింది…

watch video here: Spyder Telugu Trailer

ట్రైలర్ లో మహేశ్ క్యారెక్టర్ పూర్తిగా తెలిసిపోతుంది..నా పేరు శివ అంటూ వచ్చే డైలాగ్,తానొక ఇంటిలిజెన్స్ ఆఫీసర్ అని .. ఎవరైనా కష్టం అన్నా, ఏడ్చినా కూడా వెంటనే అక్కడ వాలిపోతాడు. అలాంటి పాత్రకు మనుషులను మేకలకంటే హీనంగా చంపుతున్న విలన్‌ తారసపడతాడు. ఆ విలన్ ని అంతమొందించడమే కథ అని అర్దం అవుతుంది.విలన్ గా ఎస్ జె సూర్య లుక్ ,ఆ చూపులు భయపెట్టే విధంగా ఉన్నాయి. మధ్యలో రకుల్ లవ్ ట్రాక్ ,అమ్మ సెంటిమెంట్ ఉన్నాయని తెలుస్తున్నాయి మహేశ్ అమ్మగా బిచ్చగాడు ఫేం దీపా రామానుజం చేస్తున్నారు..మహేశ్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి కనపడుతున్నారు..

watch video here: Spyder Tamil Trailer

ఇకపోతే తమిళ్ ట్రైలర్ కి,తెలుగు ట్రైలర్ కి మధ్య ఒక సెకెన్ తేడా ఉంది..ఆ ఒక్క సెకెన్లో తమిళ్ ట్రైలర్ లో ప్రేమిస్తే ఫేం భరత్ ని చూపించారు.తెలుగు ట్రైలర్ లో భరత్ లేడు..భరత్ క్యారెకట్ర్ ఏంటనేది సస్పెన్స్ లో పెట్టారు..తెలుగులో భరత్ నటిస్తున్నాడా..ఒకవేళ నటిస్తే భరత్ ని ఎందుకు ట్రైలర్ లో చూపించలేదు,నటించకపోతే భరత్ ప్లేస్ లో ఎవరు నటించారనే టెన్షన్లో ప్రేక్షకులను వదిలేసి..సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు..తమిళ్,తెలుగు రెండు  ట్రైలర్స్ పై మీరూ ఓ లుక్కేయండి..

Comments

comments

Share this post

scroll to top