కొవ్వును క‌రిగించే వంట ఇంటి ఔష‌ధాలు…

శ‌రీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును క‌రిగించ‌డం కోసం డైటింగులు చేయ‌డం, త‌క్కువ క్యాల‌రీల‌నిచ్చే ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వంటి ప‌నుల‌ను నేడు అధిక శాతం మంది ఊబ‌కాయులు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వారు రుచిక‌ర‌మైన‌, మసాలా ఆహార ప‌దార్థాల‌కు దూరంగా కూడా ఉంటున్నారు. అయితే ఆహారానికి రుచిని అందించే అవే ప‌దార్థాల‌ను మానేయాల్సిన ప‌ని లేదని ఆయుర్వేదం చెబుతోంది. ఎందుకంటే అలాంటి ప‌దార్థాల ద్వారా కొవ్వు సుల‌భంగా క‌రుగుతుంద‌ట‌. మ‌రింకెందుకు ఆల‌స్యం! ఆ ప‌దార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందామా!

దాల్చిన చెక్క‌…
అధిక బ‌రువును త‌గ్గించ‌డంలో దాల్చిన‌చెక్క బాగా ప‌నిచేస్తుంద‌ట‌. నిత్యం 1 టీ స్పూన్ మోతాదులో దాల్చిన చెక్క పొడిని ఆహారంతోపాటు తీసుకుంటే చాలు. కొన్ని రోజుల్లోనే కొవ్వు క‌ర‌గ‌డం మొద‌లవుతుంద‌ట‌. పొట్ట అధికంగా ఉంద‌నుకున్న వారు దీన్ని ట్రై చేస్తే మంచి ఫ‌లితం క‌నిపిస్తుంద‌ట‌.
క‌రివేపాకు…
నిత్యం కొన్ని క‌రివేపాకు ఆకుల‌ను న‌మిలితే కొవ్వు దానంత‌ట అదే క‌రుగుతుంద‌ట‌. ఎందుకంటే కొవ్వును క‌రిగించే ఔష‌ధ గుణాలు క‌రివేపాకులో పుష్క‌లంగా ఉన్నాయ‌ట‌.
గ‌రం మ‌సాలా పొడి…
ల‌వంగాలు, జీల‌క‌ర్ర త‌దిత‌రాలు క‌లిపి త‌యారు చేసిన గ‌రం మ‌సాలా పొడిని నిత్యం 1 టీస్పూన్ మోతాదులో ఆహారంతోపాటు తీసుకున్నా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ట‌. అయితే అంత‌కు మించితే మాత్రం ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

spices-for-fat-loss

ఎర్ర మిర‌ప‌కాయ‌ల కారం…
ఘాటు మాట ఎలా ఉన్నా కారం తిన‌డం వ‌ల్ల కూడా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ట‌. ఎందుకంటే క్యాప్సేసిన్ అనే ఓ ర‌సాయనం ఈ కారం పొడిలో ఉంటుంద‌ట‌. అది శ‌రీర మెట‌బాలిక్ ప్ర‌క్రియను వేగ‌వంతం చేస్తుంద‌ట‌. దీని వ‌ల్ల బ‌రువు త‌గ్గేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌.

ప‌సుపు…
ప‌సుపులో క‌ర్క్యుమిన్ అనే ఓ ర‌సాయ‌న స‌మ్మేళ‌నం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. ఇది శ‌రీరంలో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోకుండా చూస్తుంద‌ట‌. కాబ‌ట్టి నిత్యం మ‌న ఆహారంలో ప‌సుపును భాగం చేసుకుంటే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌న్న‌మాట‌.

జీల‌క‌ర్ర‌…
జీర్ణ వ్య‌వ‌స్థను స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయించ‌డంలో జీల‌క‌ర్ర బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్ని నిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రిగి కొవ్వు కూడా క‌రుగుతుంద‌ట‌.

Comments

comments

Share this post

scroll to top