ప్ర‌యాణికుల‌ను మ‌రిచిన విమానం గాల్లోకి ఎగిరింది. వెంట‌నే తిరిగొచ్చి ప్ర‌యాణికుల‌ను ఎక్కించుకుంది.

అడ్వాన్స్‌గా టిక్కెట్లు బుక్ చేసినా, చేయ‌క‌పోయినా మీరు చేయాల్సిన ప్ర‌యాణాన్ని ఎప్పుడైనా మ‌రిచిపోయారా? చాన్సే లేదంటారా? మ‌హా అయితే ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకోవ‌డ‌మో, స‌రైన టైముకి ఎక్కాల్సిన బ‌స్సో, ట్రైనో, ఫ్లైటో మిస్ అవ‌డ‌మో జ‌రిగి ఉంటుంది కానీ ప్ర‌యాణాన్ని మాత్రం మ‌రిచిపోలేదంటారా? అయితే మీరు వెరీ గుడ్ అండీ. ఎందుకంటారా? ప‌్ర‌యాణాన్ని మ‌రిచిపోనందుకు. అదేంటి ప్ర‌యాణాన్ని మ‌రిచిపోనందుకు గుడ్ అంటున్నారు ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అయితే కింద ఇచ్చింది చ‌ద‌వండి, అప్పుడు మీకే అర్థ‌మ‌వుతుంది, ఎందుకు గుడ్ అన్నామో!

spice-jet-flight

ఇటీవ‌లే తాజాగా జ‌రిగిన సంఘ‌ట‌న ఇది. అది కొచ్చి ఎయిర్‌పోర్ట్‌. ఆ రోజు రాత్రి 7 గంట‌ల‌వుతోంది. మ‌రికాసేప‌ట్లో ఎస్‌జీ 154 పేరున్న ఓ స్పైస్ జెట్ విమానం ముంబైకి వెళ్లాల్సి ఉంది. అందులో ప్ర‌యాణించే వారు సుమారు 40 మంది వ‌ర‌కు ఉన్నారు. కాగా అప్పుడు బాగా వ‌ర్షం ప‌డుతుండ‌డంతో ఎయిర్‌పోర్ట్ వారు ప్ర‌యాణికుల‌ను విమానం ఎక్కించేందుకు గాను ఓ చిన్నపాటి బ‌స్సును అరేంజ్ చేశారు. దాంట్లో వారిని ఎయిర్‌పోర్ట్ ఎంట్ర‌న్స్ నుంచి విమానం నిచ్చెన వ‌ర‌కు తీసుకెళ్లాల్సి ఉంది. అప్ప‌టికే ఆ విమానం దాదాపు అర‌గంట ఆల‌స్యంగా ర‌న్‌వే మీద‌కి వ‌చ్చింది. అయితే బ‌స్సులో ఎయిర్‌పోర్ట్ ఎంట్ర‌న్స్ వ‌ద్ద ఉన్న ప్ర‌యాణికులు చూస్తుండ‌గానే ఆ ఎస్‌జీ 154 విమానం ఒక్క‌సారిగా గాల్లోకి లేచింది. ప్ర‌యాణికులెవ‌రూ ఎక్క‌కుండానే విమానం టేకాఫ్ అయింది. ఈ క్ర‌మంలో దాన్ని చూసిన ప్ర‌యాణికులు మొద‌ట అది వేరే విమాన‌మ‌ని అనుకున్నారు. కానీ వెంట‌నే నంబ‌ర్‌ను ఐడెంటిఫై చేయ‌డంతో అది తాము ఎక్కాల్సిన విమాన‌మేన‌ని తెలుసుకున్నారు. దీంతో వారిలో ఒక్క‌సారిగా కంగారు మొద‌లైంది. తామంతా బ‌స్సులోనే ఉండ‌గా, ప్ర‌యాణికులెవ‌రూ ఎక్క‌కుండానే విమానం ఎలా టేకాఫ్ అయింద‌ని వారు గాభ‌రా ప‌డ్డారు. అయితే విష‌యం నెమ్మ‌దిగా తెలుసుకున్న ఎయిర్‌పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది కొంత దూరం వెళ్లిన ఆ ఎస్‌జీ 154 విమానాన్ని తిరిగి వెన‌క్కి ర‌ప్పించారు. దీంతో ప్ర‌యాణికులు ఎట్ట‌కేల‌కు విమానం ఎక్కి దాదాపు గంట‌న్నర ఆల‌స్యంగా గ‌మ్య‌స్థానం చేరుకున్నారు.

ఎప్పుడో గానీ ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌వు. ప్ర‌యాణికులు త‌మ ప్ర‌యాణాన్ని మ‌రిచిపోగ‌ల‌రేమో కానీ, ఏకంగా ఓ విమానం, అందులోని సిబ్బంది ప్ర‌యాణికుల‌ను తీసుకెళ్ల‌డం మ‌రిచిపోయారంటే ఆశ్చ‌ర్యంగానే ఉంటుంది మ‌రి! ఈ సంఘ‌ట‌న పట్ల ఆ విమానంలో ప్ర‌యాణించిన వారు అక్క‌డి సిబ్బందిపై తీవ్ర ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేశారు. అయినా వారు చేసేదేం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు తెలిసిందా, ప్ర‌యాణాన్ని మ‌రిచిపోనందుకు మేం మిమ్మ‌ల్ని ఎందుకు గుడ్ అన్నామో!

Comments

comments

Share this post

scroll to top