జిమ్ సెంటర్ల‌లో అతిగా వ్యాయామం చేసే వారు క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం ఇది..!

రోజూ జిమ్‌కు వెళ్తే ఎవ‌రికైనా ఏం జ‌రుగుతుంది..? ఏముందీ మంచి ఫిజిక్ వ‌స్తుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. కొవ్వు క‌రుగుతుంది. పొట్ట త‌గ్గుతుంది. ఆరోగ్య‌ప‌రంగా దృఢంగా ఉంటారు. అంతే క‌దా.. అంటారు క‌దా. అవును, ఎవ‌రు జిమ్ కు వెళ్లినా జ‌రిగేది అదే. ఇక జిమ్‌తోపాటు మంచి ఫుడ్ కూడా తింటే త్వ‌ర‌గా సిక్స్ ప్యాక్ బాడీ వ‌స్తుంది. అది కూడా క‌రెక్టే. కానీ… అలా సిక్స్ ప్యాక్ బాడీ కావాల‌ని చెప్పి ప‌రిమితికి మించిన వ్యాయామం జిమ్‌లో చేశారా..? అంతే సంగ‌తులు. ఆ వ్య‌క్తికి జ‌రిగిన‌ట్టే జ‌ర‌గ‌వ‌చ్చు. అది ప్రాణం పోయేలా చేయ‌వ‌చ్చు..!

అత‌ని పేరు వ‌రుణ్‌. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉన్న హైటెక్‌సిటీ డెల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. వ‌య‌స్సు 22 సంవ‌త్స‌రాలు. ఇత‌నిది విశాఖ‌ప‌ట్నం. ఒక సంవ‌త్స‌రం కింద‌టే హైద‌రాబాద్‌కు వ‌చ్చి డెల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే వ‌రుణ్‌కు రోజూ ఉద‌యాన్నే జిమ్ చేయ‌డం అల‌వాటు. అది ముగిశాకే ఆఫీస్‌కు వెళ్తాడు. ఈ క్రమంలోనే ఈ నెల 14వ తేదీన కూడా జిమ్‌కు వెళ్లాడు. అయితే సాధార‌ణంగా వెళ్లే స‌మ‌యం కంటే కొంచెం ముందుగానే అత‌ను జిమ్‌కు చేరుకున్నాడు. దీని వ‌ల్ల కొంత ఎక్కువ సేపు జిమ్ చేయ‌వ‌చ్చ‌ని అత‌ను భావించాడు. అయితే అత‌ను అనుకున్న‌ది రివ‌ర్స్ అయింది.

చాలా సేపు జిమ్ చేస్తున్న వ‌రుణ్ కు స‌డెన్‌గా ఛాతిలో నొప్పి వ‌చ్చింది. ఊపిరాడ‌లేదు. జిమ్ చేస్తూనే కుప్ప‌కూలాడు. దీంతో జిమ్ నిర్వాహ‌కులు అత‌న్ని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే వ‌రుణ్ మృతి చెందిన‌ట్టు వైద్యులు నిర్దారించారు. ఈ క్ర‌మంలో వారు వ‌రుణ్ మృత‌దేహానికి పోస్ట్ మార్టం చేసి అస‌లు వ‌రుణ్ ఎందుకు చ‌నిపోయాడో చెప్పారు. వ‌రుణ్ అస‌లు తిండి స‌రిగ్గా తిన‌లేద‌ట‌. అలా తిన‌కుండానే జిమ్‌కు వ‌చ్చి గంట‌ల త‌ర‌బ‌డి వ్యాయామం చేశాడు. దీంతో ఒక్క‌సారిగా అత‌ని శ‌రీరం త‌ట్టుకోలేక‌పోయింది. వెంట‌నే కండ‌రాలు వాపుల‌కు గుర‌వ‌డం మొద‌లుపెట్టాయి. పెద్ద ఎత్తున క‌ణాలు నాశ‌న‌మయ్యాయి. కండ‌రాలు, లివ‌ర్‌, ర‌క్తం త‌దిత‌ర భాగాల్లో ఉన్న క‌ణాలు వెంట వెంట‌నే డ్యామేజ్ అయ్యాయి. దీంతో అత‌నికి చాతిలో నొప్పి వ‌చ్చి ప‌డిపోయాడు. చూశారుగా..! అతిగా జిమ్ చేయ‌డం ఎంత అనర్థ‌దాయ‌క‌మో. బాగా తిండి తింటేనే చేయాలి. లేదంటే ఆ ప‌ని మానుకోవాలి. లేక‌పోతే చూశారుగా… పైన వ‌రుణ్‌కు వ‌చ్చిన‌ట్టు ప్రాణాపాయ స్థితి వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

Comments

comments

Share this post

scroll to top