స్పీడున్నోడు ట్రైలర్…. యాక్షన్..లవ్..కామెడీ కలగలిసి ఉన్నాయ్.!

‘ఒక్కసారి భుజం మీద చెయ్యేశాక వాడు ఎదవైనా, ఏ.ఆర్. రెహమాన్ అయినా ఫ్రెండ్ ఫ్రెండే’ అంటూ యాక్షన్ కామెడీ డ్రామా ఎంటర్ టైనర్ సినిమాగా తెరకెక్కిన ‘స్పీడునోడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ‘అల్లుడుశీను’ సినిమాతో టాలీవుడ్ స్క్రీన్ పై హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్, తన సెకండ్ సినిమాతో మరోసారి ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. తమిళ సినిమా ‘సుందరపాండియన్’సినిమాకు రీమేక్ గా భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వ, నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్ర ఆడియో లాంచ్ శిల్పకళా వేదికలో స్టార్ హీరోయిన్ల నడుమ కలర్ ఫుల్ గా జరిగింది. ఆడియో లాంచ్ లో చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

స్పీడున్నోడు చిత్రం ఫుల్ యాక్షన్, లవ్, కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. ‘లవ్ చేస్తే సపోర్ట్ చేస్తాడు, టీజ్ చేస్తే తోలుతీస్తాడంటూ’ హీరో క్యారెక్టర్ గురించి తెలిపాడు దర్శకుడు. ‘చింపాంజీలా ఉండేవాడు కాస్తా సంపూర్నేష్ బాబులా తయారయ్యాడు’. ‘మన లవర్ రెండేళ్ళకొకసారి వచ్చే రాజమౌళి సినిమాలా ఉండాలి’,ఇలాంటి పంచ్ డైలాగులతో పాటు ‘శత్రువు స్నేహితుడిలా మారడానికి ఎన్ని ఛాన్స్ లైనా ఇవ్వచ్చు, కానీ స్నేహితుడు శత్రువులా మారడానికి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకూడదు’ అనే డైలాగ్ సూపర్బ్  గా ఉంది.హీరోయిన్ గా నటించిన సోనారిక భడోరియా,ఐటంసాంగ్ లో మెరిసిన మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్ తో మెప్పిస్తున్నారు. డిజే. వసంత్ సంగీతం అందించిన పాటలు బాగున్నాయి. భారీ యాక్షన్, కలర్ఫుల్ సెట్టింగ్స్, ఆకట్టుకున్న విజువల్స్ ఒకెత్తయితే, ట్రైలర్ చివర్లో ‘ ఫస్ట్ లవ్ అనేది పుట్టుమచ్చ లాంటిదిరా, చివరిదాకా చెరగదు’ అని కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి చెబుతుంటే, హీరో అడ్డు చెబుతాడు, ఏం  పంచ్ డైలాగులు మీ హీరోలే చెప్తారా? మేం చెప్పకూడదా? అనే డైలాగ్ సూపర్బ్. ఫిబ్రవరి 5న ఈ సినిమా రిలీజ్ కానుంది.
Watch Speedunnodu  Trailer:

Comments

comments

Share this post

scroll to top