శబరిమలై వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌…19 స్పెషల్‌ ట్రెయిన్స్‌ వేసిన రైల్వే శాఖ. ట్రెయిన్స్‌ వివరాలు ఇవే..!

ప్రతి ఏటా మన దేశంలోని ఎంతో మంది అయ్యప్ప భక్తులు ఈ సమయంలో అయ్యప్ప మాలను ధరిస్తారు. అనేక రోజుల పాటు నిష్టగా దీక్ష చేశాక శబరిమలైకి వెళ్లి అక్కడ మాలను తీసేస్తారు. స్వామి వారిని దర్శించుకుంటారు. అయితే వారే కాదు, మాల వేయని వారు కూడా ఈ సమయంలో వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. ఈ క్రమంలోనే అలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గాను రైల్వే వారు ప్రతి ఏటా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈ సారి కూడా దక్షిణ మధ్య రైల్వే వారు 156 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఇవన్నీ ఆయా ప్రాంతాల్లో ఉన్న రైల్వే స్టేషన్ల నుంచి నడుస్తాయి. అయితే వీటిల్లో చార్జి తత్కాల్‌ టిక్కెట్‌ చార్జీకి సమానంగా ఉంటుంది. కాగా ఈ రైళ్లకు ఈ నెల 30వ తేదీ నుంచి అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ కల్పిస్తున్నారు. మరి ఆ స్పెషల్‌ ట్రెయిన్స్‌ ఏమిటో ఇప్పుడు చూద్దామా..!

1. హైదరాబాద్‌-కొల్లం స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07109)
హైదరాబాద్‌ నుంచి నవంబర్‌ 17, 21, డిసెంబర్‌ 11, 15, 23, 31, జనవరి 3, 5, 7, 9, 11, 13వ తేదీల్లో మధ్యాహ్నం 3.55గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 11. 10 గంటలకు కొల్లం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో… కొల్లం-హైదరాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07110) నవంబరు 15, డిసెంబరు 1, 8, 15, 24, జనవరి 2, 5, 7, 9, 11, 13, 15వ తేదీల్లో తెల్లవారుజాము 2.15గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 10.30గంటలకు హైదరాబాద్‌ చేరుతుంది.

2. హైదరాబాద్‌-కొల్లం స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07141)
హైదరాబాద్‌ నుంచి నవంబరు 25, డిసెంబరు 16, 19, 24, జనవరి 4, 6, 8, 10, 12, 14, 15వ తేదీల్లో సాయంత్రం 4.15గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 11.10గంటలకు కొల్లం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో…. కొల్లం-హైదరాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07142) కొల్లం నుంచి నవంబరు 27, డిసెంబరు 18, 21, 26, జనవరి 6, 8, 10, 12, 14, 16, 17వ తేదీల్లో తెల్లవారుజాము 2.15గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌ చేరుతుంది.

3. నిజామాబాద్‌-కొల్లం స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07143)
నిజామాబాద్‌ నుంచి నవంబరు 13, 29వ తేదీల్లో మధ్యాహ్నం 12.10గంటలకు బయల్దేరి, మ రుసటి రోజు రాత్రి 11.30గంటలకు కొల్లం చేరుతుం ది. తిరుగు ప్రయాణంలో…. కొల్లం-నిజామాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07144) కొల్లం నుంచి నవంబరు 19, 23వ తేదీల్లో తెల్లవారుజాము 2.15గంటలకు బయల్దేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.15గంటలకు నిజామాబాద్‌ చేరుతుంది.

4. కాకినాడ టౌన్‌-కొల్లం స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07211)
కాకినాడ టౌన్‌ నుంచి నవంబరు 10, 15, 19, 23, 27, డిసెంబరు 12, 14, 17, 18, 20, 21, 23, 24, 28, జనవరి 1, 3, 4, 6, 7, 10, 11, 13, 14వ తేదీల్లో రాత్రి 11.50గంటలకు బయల్దేరి, రెండో రోజు ఉదయం 6.30గంటలకు కొల్లం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో….. కొల్లం-కాకినాడ టౌన్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07212) కొల్లం నుంచి నవంబరు 12, 17, 21, 25, 29, డిసెంబరు 14, 16, 19, 20, 22, 23, 25, 26, 30, జనవరి 3, 5, 6, 8, 9, 12, 13, 15, 16వ తేదీల్లో ఉదయం 9.30గంటలకు బయల్దేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.30గంటలకు కాకినాడ టౌన్‌ చేరుతుంది.

5. హైదరాబాద్‌-కొల్లం స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07133)
హైదరాబాద్‌ నుంచి డిసెంబరు 12, 20, 30, జనవరి 2, 16వ తేదీల్లో మధ్యాహ్నం 3.30గంటలకు బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 11.10గంటలకు కొల్లం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో…. కొల్లం-హైదరాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07134) కొల్లం నుంచి డిసెంబరు 14, 22, జనవరి 1, 4, 18వ తేదీల్లో తెల్లవారుజాము 2.15గంటలకు బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 10.30గంటలకు హైదరాబాద్‌ చేరుతుంది.

6. నిజామాబాద్‌-కొల్లం స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07613)
నిజామాబాద్‌ నుంచి డిసెంబరు 6, 13, 22వ తేదీల్లో మధ్యాహ్నం 12.10గంటలకు బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 11.10గంటలకు కొల్లం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో…. కొల్లం-నిజామాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07614) కొల్లం నుంచి డిసెంబరు 13, 17, 25వ తేదీల్లో తెల్లవారుజాము 2.15గంటలకు బయల్దేరి, రెండో రోజు మధ్యాహ్నం 1. 15గంటలకు నిజామాబాద్‌ చేరుతుంది.

7. కరీంనగర్‌-కొల్లం స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07113)
కరీంనగర్‌ నుంచి డిసెంబరు 29వ తేదీ సాయంత్రం 4గంటలకు బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 11.10గంటలకు కొల్లం చేరుతుంది.

8. కాచిగూడ-కొల్లం స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07611)
కాచిగూడ నుంచి జనవరి 1వ తేదీ మధ్యాహ్నం 3.40గంటలకు బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 11.10గంటలకు కొల్లం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో….. కొల్లం-కాచిగూడ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07612) కొల్లం నుంచి జనవరి 3వ తేదీ తెల్లవారుజామ 2.15గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 10.15గంటలకు కాచిగూడ చేరుతుంది.

9. నర్సాపూర్‌-కొల్లం స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07217)
నర్సాపూర్‌ నుంచి డిసెంబరు 20, 30వ తేదీల్లో రాత్రి 11.50గంటలకు బయల్దేరి, రెండో రోజు ఉదయం 6.30గంటలకు కొల్లం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో…. కొల్లం-నర్సాపూర్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07218) కొల్లం నుంచి డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో ఉదయం 9.30గంటలకు బయల్దేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.45గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది.

10. మచిలీపట్నం-కొల్లం స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07221)
మచిలీపట్నం నుంచి డిసెంబరు 10, 16, 19వ తేదీల్లో రాత్రి 11.40గంటలకు బయల్దేరి, రెండో రోజు ఉదయం 6.30గంటలకు కొల్లం చేరుతుంది.

11. విజయవాడ-కొల్లం స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07213)
విజయవాడ నుంచి డిసెంబరు 8, 14, 23వ తేదీల్లో ఉదయం 4గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6.30గంటలకు కొల్లం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో….. కొల్లం-విజయవాడ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07214) కొల్లం నుంచి డిసెంబరు 12, 21, 24వ తేదీల్లో ఉదయం 9.30గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 9.35గంటలకు విజయవాడ చేరుతుంది.

12. ఔరంగాబాద్‌-కొల్లం స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07505)
ఔరంగాబాద్‌ నుంచి డిసెంబరు 7, 21వ తేదీల్లో ఉదయం 11గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 3.45గంటలకు కొల్లం చేరుతుంది.

13. అకోలా-కొల్లం స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07507)
అకోలా నుంచి డిసెంబరు 14వ తేదీ ఉదయం 11.50గంటలకు బయల్దేరి రాత్రి 10.10గంటలకు కాచిగూడ స్టేషన్‌, రెండో రోజు తెల్లవారుజాము 3.45గంటలకు కొల్లం చేరుతుంది.

14. ఆదిలాబాద్‌-కొల్లం స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07509)
ఆదిలాబాద్‌ నుంచి డిసెంబరు 28వ తేదీ మధ్యాహ్నం 1.25గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 10.10గంటలకు కాచిగూడ, రెండో రోజు ఉదయం 3.45 గంటలకు కొల్లం చేరుతుంది.

15. సిర్పూర్‌కాగజ్‌నగర్‌-కొల్లం స్పెషల్‌ (రైల్‌ నెం బర్‌: 07111)
సిర్పూర్‌కాగజ్‌నగర్‌ నుంచి జనవరి 5, 11వ తేదీల్లో రాత్రి 9.15గంటలకు బయల్దేరి, రెండో రోజు ఉదయం 3.45గంటలకు కొల్లం చేరుతుంది.

16. కొల్లం-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07112)
కొల్లం నుంచి డిసెంబరు 31, జనవరి 7, 13వ తేదీల్లో ఉదయం 5.45గంటలకు బయల్దేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.20గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది.

17. విజయవాడ-కొల్లం స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07219)
విజయవాడ నుంచి జనవరి 4,10వ తేదీల్లో రాత్రి 11.55గంటలకు బయల్దేరి, రెండో రోజు ఉద యం 3.45గంటలకు కొల్లం చేరుతుంది. తిరుగు ప్ర యాణంలో.. కొల్లం-విజయవాడ స్పెషల్‌ (రైల్‌ నెం బర్‌: 07220) కొల్లం నుంచి జనవరి 9, 15వ తేదీల్లో ఉదయం 5.45గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 8.15గంటలకు విజయవాడ చేరుతుంది.

18. కొల్లం-తిరుపతి స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07506)
కొల్లం నుంచి డిసెంబరు 9, 16, 23, 30వ తేదీల్లో ఉదయం 5.45గంటలకు బయల్దేరి, మరుసటి రోజు తెల్లవారుజాము 12.15గంటలకు తిరుపతి చేరుతుంది.

19. తిరుపతి-అకోలా స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07408)
తిరుపతి నుంచి డిసెంబరు 18వ తేదీ ఉదయం 9.15గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి అదే రోజు రాత్రి 10.15గంటలకు కాచిగూడ, మరుసటి రోజు ఉదయం 10గంటలకు అకోలా చేరుతుంది.

Comments

comments

Share this post

scroll to top