“ఇవాంక” కోసం హైదరాబాద్ లో ప్రత్యేక విందు…8 ఐటమ్స్ ఇవే..! ఎక్కడ అంటే…?

ఈ నెల 29న జరిగే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సదస్సులో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు వ్యక్తిగత సలహాదారు, కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌కు రానున్న విషయం తెలిసిందే.దీని కోసం ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు..ఇవాంకా రాకతో హైదరాబాద్ నగరం ఒకవైపు అద్దంలా మెరిసిపోతుండడం విశేషం. ఇవాంకా రాక సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆమెకు అదిరిపోయే విందును ఏర్పాటు చేయలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారట..ఆ బాద్యతలు ఎవరికి అప్పగించారు..ఆ విందులో ఏమేం ఏర్పాటుచేయబోతున్నారో తెలుసా..

గోల్కొండ కోట వేదిక  అద్భుతమైన విందును ఇచ్చి , తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని చాటాలని  భావిస్తున్నారు. ఈ బాధ్యతను ఐటీ శాఖ మంత్రి  కేటీఆర్ తీసుకున్నారు.ట్రంప్ కూతరురికి..ఇవాంకాకు ఇచ్చే విందులో  హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించేలా వంటకాలను  తయారు చేయబోతున్నారట…

  • పతర్ కా గోస్ట్ 
  • షీర్ కుర్మా
  • డబుల్ కా మిఠా
  • బగారే బైగాన్ 
  • దమ్ కా బిర్యానీ
  • కుర్బానీ కా మీఠా
  • ఇరానీ చాయ్
  • రవ్వ లడ్డు

వీటితో పాటు ఇతర భారతీయ వంటకాలు, చైనీస్, ఫ్రెంచ్, గ్రీక్, ఇటాలియన్, కరేబియన్ వంటకాలను కూడా తయారు చేయించనున్నారట. వీటిని వండడానికి చేయితిరిగిన చెఫ్‌లకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయట..

 

Comments

comments

Share this post

scroll to top