రాత్రికి రాత్రే ఆ ఊరిలో పేదరికం అనేదే లేకుండా చేశాడు.

స్పెయిన్ లోని ఆంటొనినో ఫెర్నాండెజ్ అనే వ్యాపారి తీసుకున్న నిర్ణయంతో తాను పుట్టిన గ్రామంలో పేదరికం అనేదే లేకుండా పోయింది. ఈ వ్యాపారి తన ఊరిలోని ప్రజలందరికీ తన ఆస్తిలో వాటా కల్పిస్తూ వీలునామా రాసి మరణించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.14 వేల కోట్ల ఆస్తిని తను పుట్టిన ఊరికి రాసిచ్చాడు. దీంతో అక్కడి ప్రజలంతా రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. పేదరికంతో చిన్న తనంలో పడ్డ కష్టాలను గుర్తుంచుకున్న ఫెర్నాండెజ్, తనలా తన సొంత ఊరిలోని వారెవరు బాధపడకూదనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడంటా.

LA LOCALIDAD DE CEREZALES DEL CONDADO HOMENAJEA A ANTONINO FERNANDEZ, PRESIDENTE DEL CONSEJO DE ADMINISTRACION DEL GRUPO MODELO

1917లో స్పెయిన్‌లోని సెరెజల్స్‌ డెల్‌ కొండాడొ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన ఫెర్నాండెజ్ కి 13మంది అక్కచెల్లెలు ఉన్నారు. ఇంత పెద్ద కుటుంబాన్ని పోషించేందుకు తల్లిదండ్రుల సంపాదన సరిపోక పోవడంతో 14ఏళ్ల వయస్సులోనే చదువుకు స్వస్తి చెప్పాడు ఫెర్నాండెజ్. 1949లో బతుకుదెరువు కోసం తన భార్యతో సహా మెక్సికో వలస వెళ్లిన ఆయన కష్టపడి బాగానే సంపాదించాడు. సొంత తెలివితో అంతగా చదువుకోకపోయిన ప్రముఖ పానీయాల తయారీ సంస్థ గ్రూప్‌ మొడెలో లో సీఈవో స్థాయికి ఎదిగాడు. అక్కడితో ఆగిపోకుండా సొంతగా బీర్‌లను తయారు చేసే సంస్థను స్థాపించి వేల కోట్ల రూపాయలను ఆర్జించాడు. ఇంత గొప్ప స్థాయికి ఎదిగిన ఆంటోనినో ఫెర్నాండెజ్ పుట్టిన ఊరును మాత్రం మరువలేదు. తన ఊరికి రూ. 14 వేల కోట్ల ఆస్తిని రాసిచ్చాడు. దీంతో గ్రామాల్లోని ఒక్కొక్కరికి 17.5 కోట్ల రూపాయలు వచ్చి చేరాయి. నిన్న మొన్నటి వరకు కడు పేదరికంలో బ్రతికిన ఆ ఊరి ప్రజలు ఫెర్నాండజ్ తీసుకున్న నిర్ణయంతో కోటీశ్వరులయ్యారు. ఈ ఏడాది ఆగష్టులో ఆంటోనినో ఫెర్నాండెజ్( 99 ) తుది శ్వాస విడిచాడు. ఆ ఊరి ప్రజల్లో గుండెల్లో మాత్రం ఎప్పటికీ అమరుడిగానే ఉంటాడు. స్పెయిలోని సెరెజల్స్ డెల్ కొండాడో లో ఆయనకి దేవాలయాన్ని కట్టించి పూజించుకుంటున్నారు అక్కడి ప్రజలు.

Comments

comments

Share this post

scroll to top