కాలేజీకి అని వెళ్ళింది..హత్యకు గురైంది..! చంపేసింది ఆమె బావనే..! ఎందుకో తెలుసా..?

ఆరేళ్ల ప్రేమాయణాన్ని పెళ్లిగా మార్చుకుందామని ప్రియుడితో గొడవపడి శవంగా మారింది చాందిని జైన్..ఆ ఘటన మరువకముందే మరొక సంఘటన జరిగింది.స్వయాన మేనబావ చేతిలో హతమైన సౌమ్య..చాలా కిరాతకంగా హత్యచేసి ఆ తర్వాత చెరువులో పడేసిన సంఘటన..మనం ఏ సమాజంలో ఉన్నాం,మనుషుల మద్యే బతుకుతున్నామా అనే ప్రశ్న తలెత్తుతుంది..సౌమ్యకి తన బావకి ఉన్న సంభందం ఏంటి..బావ చేతిలో హతమవడానికి గల కారణమేంటి…

సాయంత్రం కాలేజీకి అని చెప్పి ఇంట్లోంచి వెళ్లిన సౌమ్య,అర్థరాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో  పోలీసులకు ఫిర్యాదు చేశారు సౌమ్య తల్లిదండ్రులు. డిగ్రీ చదువుతున్న సౌమ్యని మేనబావ కృష్ణయ్యే  హత్య చేసినట్టు తెలిసింది. సౌమ్య మరొక వ్యక్తితో చనువుగా ఉండడం చూసిన కృష్ణయ్య అది తట్టుకోలేక..తనతో గొడవ పడి,తర్వాత బలంగా కొట్టడంతో సౌమ్య అక్కడిక్కడే మృతి చెందింది.బాడీని చెరువులో పడేసి వెళ్లిపోయితర్వాత కుకట్ పల్లి పోలిస్ స్టేషన్ కి వెళ్లి నేరం ఒప్పుకున్నాడు.సౌమ్యని చంపేసి ఎక్కడ పడేసింది తనే స్వయంగా పోలిసులకు చెప్పాడు.కృష్ణయ్య ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఐడిఎల్ చెరువులో నుండి సౌమ్య డెడ్ బాడీ ని బయటికి తీసారు..సౌమ్యకి,కృష్ణయ్య కి పెళ్లి చేయాలని ఇరు కుటుంబసభ్యులు భావించారని..కానీ కృష్ణయ్య ఇంకా సెటిల్ కాలేదనే కారణం చేత పెళ్లి విషయం జాప్యం జరుగుతూ వచ్చింది.ఈలోపు ఇలా జరిగింది.ఇది ఇలా ఉంటే సౌమ్య కి ఇంటర్ లో ఉండగానే పెళ్లి జరిగిందని,అతనితో వెళ్లడం ఇష్టంలేక పుట్టింట్లోనే ఉండిపోయిందని చెప్తున్నారు బందువులు…ఆ తర్వాత కృష్ణయ్యతో వివాహం నిశ్చయించారని తెలుస్తుంది.

ప్రేమించకపోతే హత్య,వేరోకరితో చనువుగా మాట్లాడితే హత్య..ఇలా జరుగుతూ పోతే ఆడపిల్లల పరిస్థితి ఏంటి.యత్రనార్యస్తు పూజ్యతే ,రమంతే తత్ర దేవతా:..అనేది ఎటు పోతుంది అర్దం కావట్లేదు.ఆడపిల్లలకు చదువు ,ఉద్యోగం,తమ కాళ్లపై తాము నిలబడ్డం ఎంతైనా అవసరం అనే విషయం ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారి స్ఫష్టమవుతుంది.

Comments

comments

Share this post

scroll to top