16 ఏళ్ల త‌రువాత రైలులో ప్ర‌యాణించిన మాజీ క్రికెట‌ర్ సౌర‌వ్ గంగూలీకి చేదు అనుభవం..!

అస‌లే ఆయ‌న దాదా. ఆయ‌న్ను ముద్దుగా బెంగాల్ టైగ‌ర్ అని పిలుచుకుంటారు. ఆగ్ర‌హం వ‌స్తే అంతే… ఎదుట ఎంత‌టి వారున్నా దుమ్ము దుల‌పంది వ‌దిలిపెట్ట‌రాయ‌న‌. ఆయ‌నే మాజీ క్రికెట‌ర్ సౌర‌వ్ గంగూలీ. అటు ఆట‌లో ఆన్‌ఫీల్డ్‌లోనే కాదు, ఆట ఆడ‌కపోయినా ఆఫ్ ది ఫీల్డ్‌లోనూ దాదా దాదాయే. అయితే అంత‌టి దాదాకు ఎందుకో ఈ మ‌ధ్య ట్రెయిన్ జ‌ర్నీ చేయాల‌ని బుద్ధి పుట్టింది. ఇంకేముందీ వెంట‌నే తాను వెళ్లాల్సిన ఓ కార్య‌క్ర‌మానికి స‌హ‌జంగా కారు కాకుండా ట్రెయిన్‌లో వెళ్దామ‌నుకుని ఓ రైలులో ఫ‌స్ట్ ఏసీ బెర్త్ బుక్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌యాణం చేద్దామని రైలు ఎక్కే స‌రికే త‌న బెర్త్‌ను వేరే ప్ర‌యాణికుడు ఆక్ర‌మించేశాడు. మరి మ‌న దాదా చూస్తూ ఊరుకున్నాడా..? ఏం చేశాడంటే..!

మాజీ క్రికెట‌ర్ సౌర‌వ్ గంగూలీ ప‌శ్చిమ బెంగాల్‌లోని బాలుర్‌ఘాట్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన త‌న విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి ఇటీవ‌ల వెళ్లారు. అయితే ఆ ప్రాంతానికి గంగూలీ కారులో కాకుండా ట్రెయిన్‌లో వెళ్దామ‌ని భావించి ప‌దాతిక్ ఎక్స్‌ప్రెస్ అనే రైలులో ఫ‌స్ట్ ఏసీ బెర్త్ బుక్ చేసుకున్నారు. ఆయ‌న‌తోపాటుగా క్రికెట్ అసోసియేష‌న్ ఆఫ్ బెంగాల్ జాయింట్ సెక్ర‌ట‌రీ అభిషేక్ దాల్మియా కూడా ప్ర‌యాణం చేసేందుకు బెర్త్ బుక్ చేసుకున్నారు. అయితే ట్రెయిన్‌లో ఎక్కాక త‌న బెర్త్ వ‌ద్ద‌కు గంగూలీ వెళ్ల‌గానే అప్ప‌టికే అందులో వేరే ప్ర‌యాణికుడు ఉన్నాడు. దీంతో గంగూలీ అది త‌న బెర్త్ అని, తాను రిజ‌ర్వ్ చేసుకున్నాన‌ని, క‌నుక అందులో నుంచి లేవాల‌ని చాలా మ‌ర్యాద‌గానే ఆ ప్ర‌యాణికున్ని అడిగాడు.

సాధార‌ణంగా గంగూలీ శైలి ఎలా ఉంటుందో మ‌న‌కు తెలుసు క‌దా. అలాంటి ధోర‌ణి వ‌దిలి చాలా విన‌మ్రంగా అడిగినా ఆ ప్ర‌యాణికుడు విన‌లేదు స‌రి క‌దా. ఎట్టి ప‌రిస్థితిలోనూ బెర్త్ వ‌దిలి వెళ్లేది లేద‌ని అక్క‌డే కూడ‌బ‌లుక్కుని కూర్చున్నాడు. దీంతో గంగూలీకి, ఆ ప్ర‌యాణికుడికి మ‌ధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో రైల్వే పోలీసులు వచ్చి గంగూలీకి అదే ట్రెయిన్‌లో ఏసీ 2 టైర్‌లో బెర్త్ ఇప్పించారు. ఈ క్ర‌మంలో వివాదం సద్దుమ‌ణిగింది. గంగూలీ ప్ర‌యాణం ముగించుకుని కార్య‌క్ర‌మంలో పాల్గొన్నాడు. త‌న విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించాడు. ఆ ఫొటోల‌ను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశాడు. అయితే గంగూలీ ట్రెయిన్‌లో ఎందుకు వెళ్లాల‌నుకున్నారో తెలియ‌దు కానీ… ఆయ‌న ట్రెయిన్ ఎక్కి 16 ఏళ్ల‌కు పైనే అయింది. అప్పుడెప్పుడో 2001లో రైలులో ప్ర‌యాణించిన గంగూలీ.. ఇదిగో ఇప్పుడిలా మ‌ళ్లీ రైలు ఎక్కారు. ఈ క్ర‌మంలోనే ఆ ప్ర‌యాణం కాస్తా ఇలా మారింది. దీంతో గంగూలీ కొంత అస‌హ‌నం చెందిన‌ట్టు తెలిసింది. మ‌రి మ‌ళ్లీ రైలులో వెళ్లే సాహ‌సం చేస్తారో, లేదో వేచి చూస్తే తెలుస్తుంది..!

Comments

comments

Share this post

scroll to top