అర్ధరాత్రి లాహోర్‌ వీధుల్లో గంగూలీ..? ముషారఫ్‌ నుంచి హెచ్చరికతో ఫోన్‌..!

సౌర‌వ్ గంగూలీ.. మ‌న దేశంలోనే కాదు, క్రికెట్ ఆడే దేశాల‌న్నింటిలోనూ ఆ క్రీడాభిమానులకు చిర‌ప‌రిచిత‌మైన పేరు ఇది. గంగూలీ అంటే తెలియ‌ని వారుండ‌రు. భారత క్రికెట్‌ను కుదిపేసిన మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం అనంతరం జట్టు నాయకత్వ పగ్గాలను అందుకున్న గంగూలీ తోటి ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తూ జట్టుకు చిరస్మరణీయ విజయాలందించడంలో కీలకమయ్యాడు. అనేక సంద‌ర్భాల్లో జ‌ట్టును ఒంటి చేత్తో న‌డిపించాడు. తాను భార‌త క్రికెట్ జ‌ట్టుకు కెప్టెన్‌గా ఉన్న స‌మ‌యంలో ఎవ‌రి మాటా వినేవాడు కాద‌ని మ‌నంద‌రికీ తెలుసు. అయితే గంగూలీ కెరీర్‌లో ఓ సారి పాకిస్థాన్‌లో పర్య‌టించినప్పుడు అత‌నికి వింత అనుభ‌వం ఎదురైంద‌ట‌. అదేమిటో తెలుసా..!

2004వ సంవ‌త్స‌రంలో ఇండియా క్రికెట్ జ‌ట్టు పాకిస్థాన్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లింది. అందులో భాగంగా ఆ టీమ్‌తో టెస్టు, వ‌న్డే సిరీస్‌ను ఆడింది. అయితే వ‌న్డే సిరీస్‌లో 3-2తో భార‌త్ పాకిస్థాన్‌పై విజ‌యం సాధించింది. దీంతో సిరీస్ నెగ్గిన ఆనందాన్ని ఎంజాయ్ చేసేందుకు అప్ప‌టి కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ పాకిస్థాన్‌లోని లాహోర్‌లో అర్థ‌రాత్రి పూట వీధుల్లో సంచ‌రించాడు. తాము ఉంటున్న లాహోర్‌లోని స్విష్ పెర‌ల్ కాంటినెంట‌ల్ హోట‌ల్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన గంగూలీ ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే బయ‌ట తిరిగాడ‌ట‌.

అలా గంగూలీ తిరిగిన విష‌యాన్ని తెలుసుకున్న అప్ప‌టి పాకిస్థాన్ అధ్య‌క్షుడు ప‌ర్వేజ్ ముషార‌ఫ్ గంగూలీకి ఫోన్ చేసి అత‌న్ని సుతిమెత్త‌గా మంద‌లించాడ‌ట‌. పాకిస్థాన్‌లో అర్ధరాత్రివేళ వీధుల్లో తిరిగే సాహసం చేయొద్దని, దానికంటే వసీం అక్రమ్‌ భయంకరమైన ఇన్‌-కట్టర్లను ఎదుర్కోవడం సులభమని ముషార‌ఫ్ గంగూలీకి స‌ల‌హా ఇచ్చార‌ట‌. అయితే ఇప్పుడీ విష‌యం ఎలా బ‌య‌టికి వ‌చ్చింది అనేగా మీ డౌట్‌. ఏమీ లేదండీ.. గంగూలీ త‌న ఆత్మ‌క‌థ‌ను రాశాడు క‌దా. ఆ బుక్ పేరు ఎ సెంచరీ ఇజ్‌ నాట్ ఎనఫ్‌. ఇందులోనే పైన చెప్పిన ఆ విష‌యాన్ని గంగూలీ చెప్పాడ‌ట‌. ఇక దీంతోపాటు ఎవ‌రి మాట విన‌కుండా అప్ప‌ట్లో తాను కోచ్ గా గ్రెగ్ చాపెల్‌ను ఎంపిక చేయ‌మ‌న్నందుకు త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింద‌ని కూడా గంగూలీ ఈ పుస్త‌కంలో రాశాడ‌ట‌. ఈ పుస్త‌కం త్వ‌రలో విడుద‌ల కానుండ‌గా, ఇందులో ఇంకా ఇలాంటి ఎన్నో సంచ‌ల‌న విష‌యాలు ఉన్నాయ‌ని కూడా తెలిసింది. చూద్దాం మ‌రి.. అవేమిటో..!

Comments

comments

Share this post

scroll to top